Begin typing your search above and press return to search.

సూర్య బ్యాన‌ర్లో 'ఓ మై డాగ్' తో మ‌రో సందేశం?

By:  Tupaki Desk   |   11 April 2022 11:10 AM GMT
సూర్య బ్యాన‌ర్లో ఓ  మై డాగ్ తో మ‌రో సందేశం?
X
కోలీవుడ్ హీరో సూర్య తన సొంత బ్యానర్ 2డి ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై అగ్ర హీరోల‌తో పాటు కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల్ని నిర‌ల్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అవి స‌మాజానికి...చిన్న పిల్ల‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కించిన చిత్రాలు త‌ల్లిదండ్రుల‌కు ఎంతో అవేర్ నెస్ క‌ల్పిస్తున్నాయి. ప్ర‌స్తుతం 'ఓ మై డాగ్' అనే ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇది తండ్రి కొడుకు ఓ కుక్క పిల్ల మ‌ధ్య‌లో సాగే కథ. టైటిల్ తోనే సినిమా ఎలా ఉంటుంద‌న్న‌ది ఓ అంచ‌నాకి రావ‌చ్చు. ఇందులో సీనియర్ నటుడు విజయ్ కుమార్ త‌నయుడు అరుణ్ విజయ్ నటిస్తుండ‌గా...అత‌ని కుమారుడి పాత్ర‌లో ఓన్ స‌న్ ఆర్నవ్ విజయ్ న‌టిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ట్రైల‌ర్ ఆద్యంతం ఫ‌న్నీగా సాగుతుంది. ఓ కుక్క పిల్ల‌కి- పిల్లాడికి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో తండ్రి – కొడుకుల మధ్య సాగే సెంటిమెంట్ గా మూవీని తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో సిబ్బా అనే కుక్క పిల్ల పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉంది.

సిబ్బా..ఆర్న‌వ్ అల్లరి ప‌నులు తో విసిగిపోయిన త‌ల్లిదండ్రులు..స్కూల్ స్టాప్ ఎలా రియాక్ట్ అయ్యారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. ఈ రెండు పాత్ర‌లే ట్రైల‌ర్ లో ప్ర‌ధానంగా హైలైట్ అవుతున్నాయి. బీజీఎమ్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. చివ‌రిగా సూర్య మార్క్ సందేశం త‌ప్ప‌ని స‌రి అని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని సరోజ్ షణ్ముగం తెరకెక్కించారు. ఇక సంగీతం నివాస్ కె ప్రసన్న దీనికి అందించారు. ఈ సినిమాను గత ఏడాది డిసెంబర్ లోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలనుకున్నా కుదరలేదు. ఇప్పుడు తెలుగులోనూ అనువాదం చేసి ఈ నెల 21న స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇందులో విజయ్ కుమార్.. మహిమా నంబియార్.. వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు.. మరి యాక్షన్ హీరోగా ఇటీవల కాలంలో గుర్తింపు తెచ్చుకున్న అరుణ్‌ విజయ్ కు'ఓ మై డాగ్' ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

సూర్య అమెజాన్ ప్రైమ్ తో త‌న బ్యాన‌ర్లో సినిమాలు రిలీజ్ అయ్యేలా ఒప్పందం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 'ఉడన్ పిరప్పి'.. 'జై భీమ్' కూడా ఓటీటీ లో రిలీజ్ అయి పెద్ద స‌క్సెస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మ‌రో సినిమాని ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. మ‌రి ఎలాంటి ఫ‌లితాలు సాధిస్తుంది? అన్న‌ది చూడాలి.