Begin typing your search above and press return to search.
ప్రకాష్ రాజ్ .. అప్పూ ఎక్స్ ప్రెస్
By: Tupaki Desk | 26 March 2022 9:32 AM GMTకన్నడ స్టార్ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఉరాఫ్ అప్పూ గత ఏడాది అక్టోబర్‌లో గుండె పోటు కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన హఠాన్మరణంతో కన్నడ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఫ్యాన్స్ అప్పూ లేరన్న విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇటీవల పునీత్ రాజ్ కుమార్ తొలి జయంతి సందర్భంగా మార్చి 17న ఆయన నటించిన చివరి చిత్రం `జేమ్స్` విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేశారు.
ఈ మూవీ రిలీజ్ సందర్భంగా కన్నడ ఇండస్ట్రీ మార్చి 17 నుంచి 22 వరకు కర్ణాటకలోని థియేటర్లలో `జేమ్స్ ` చిత్రం తప్ప మరో సినిమా ప్రదర్శించడానికి వీలు లేదని, అలా ఎవరూ ప్రదర్శించకూడదని తీర్మాణం కూడా చేసుకున్నారు. అనుకున్న ప్రకారం అన్ని థియేటర్లలో అప్పూ నటించిన చివరి చిత్రం `జేమ్స్`ని రిలీజ్ చేశారు. థియేటర్లలో సినిమా చూస్తున్న అభిమానులు వెండితెరపై చివరి సారిగా అప్పూని చూసి భావోద్వేగానికి లోనయ్యారు.
దీంతో కర్ణాటకలోని అత్యధిక థియేటర్లు అభిమానుల కన్నీటితో తడిసి ముద్దయ్యాయి. ఇందుకు సంబంధిం,ఇన వీడియోలు నెట్టింట వైరలై ఎంత మందిని భావోద్వేగానికి గురిచేశాయి.
ఇదిలా వుంటే శనివారం ప్రకాష్ రాజ్ దివంగత హీరో అప్పూ గురించి, ఆయన సేవల గురించి చేసిన ప్రకటన పలువురిని ఆశ్చర్యాన్ని కలిగించింది. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పునీత్ రాజ్ కుమార్ గురించి కీలక ప్రకటన చేశారు.
కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ సేవలని `ప్రకాష్ రాజ్ షౌండేషన్`ద్వారా ముందుకు తీసుకెళుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. సంబంధిత వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ `అప్పూ` ఫొటోతో కూడిన ఓ ప్రకటనని విడుదల చేశారు. అందులో `అప్పూ ఎక్స్ ప్రెస్` అని రాసి వుంది. ఈ ప్రకటన చూసిన చాలా మంది నెటిజన్స్ ప్రకాష్ రాజ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.