Begin typing your search above and press return to search.
ఈ డైరెక్టర్ జోరు మామూలుగా లేదుగా
By: Tupaki Desk | 30 March 2022 2:30 AM GMTతెలుగు సినిమా మార్కెట్ పెరిగిపోవడంతో చాలా మంది దర్శకుడు స్టార్ హీరోలతో పాన్ ఇండియా స్థాయి చిత్రాలని ప్లాన్ చేస్తున్నారు. హీరోలు కూడా తమ మార్కెట్ స్థాయిని పెంచుకునే క్రమంలో ఈ తరహా చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అయితే ఓ డైరెక్టర్ మాత్రం పాన్ ఇండియా మూవీ ని పక్కన పెట్టి ఇప్పడు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ కాంబినేషన్ లతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ పై వుండగానే మరో చిత్రాన్ని పట్టాలెక్కించి ఆశ్చర్యపరుస్తున్నారు.
ఆయన మరెవరో కాదు ప్రవీణ్ సత్తారు. సాఫ్ట్ వేర్ రంగాన్ని విడిచి `ఎల్బీడబ్ల్యూ` (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. విభిన్నమైన కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం హీరోగా సిద్దూ జొన్నలగడ్డకు ఇది తొలి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఈ మూవీ మంచి విజయాన్ని సాధించడంతో దర్శకుడిగా గుర్తింపుని పొందిన ప్రవీణ్ సత్తారు ఇక వెను తిరిగి చూసుకోలేదు.
దర్శకుడిగా తనదైన మార్కు చిత్రాలతో ముందుకు సాగుతూనే వున్నాడు. డా. రాజశేఖర్ తో చేసిన `పీఎస్ వీ గరుడ వేగ` చిత్రంతో దర్వకుడిగా మరింత పాపులర్ అయిన ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం కింగ్ నాగార్జున హీరోగా స్పై థ్రిల్లర్ మూవీ `ది ఘోస్ట్`ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ ని, ఓ రొమాంటిక్ సాంగ్ ని దుబాయ్ లో పూర్తి చేసి ఇండియా తిరిగి వచ్చారు.
ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇదిలా వుంటే తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు ప్రవీణ్. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు కొత్త చిత్రాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ మూవీని నిర్మిస్తున్నారు. `ఫ్యామిలీ మ్యాన్ ` సిరీస్ తరహాలో సాగే యాక్షన్ థ్రిల్లర్. వచ్చే నెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
ప్రవీణ్ సత్తారు ఈ రెండు చిత్రాలకు ముందు సుధీర్ బాబు హీరోగా బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ జీవిత కథ ఆధారంగా ఓ మూవీని చేయాలనుకున్నారు. ఇందు కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా చేశారు. కానీ ఏళ్లు గడుస్తున్న ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చిన ప్రవీణ్ సత్తారు బ్యలాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యమ బిజీగా మారిపోవడం విశేషం.