Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీ వర్గాలకు దొరకని జక్కన్న ఎక్కడ?
By: Tupaki Desk | 30 March 2022 1:30 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ `ట్రిపుల్ ఆర్`. చాలా కాలంగా ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. మొత్తానికి మూడున్నరేళ్ల నిరీక్షణ అనంతరం ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. 1920 ప్రి ఇండిపెండెన్స్ ఎరా నేపథ్యంలో సాగిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీం పాత్రలో నటించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.
మార్చి 25 భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చరణ్, ఎన్టీఆర్ ల అద్భుత నటనకు జేజేలు పలుకుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఆరు రోజులకు గానూ వరల్డ్ వైడ్ గా 600 కోట్లు వసూళు చేసి రికార్డులు సాధిస్తోంది. ఇటీవలే బాహుబలి రాకార్డుని తిరగరాసిన ట్రిపుల్ ఆర్ తాజాగా మరిన్ని రికార్డులపై కన్నేసినట్టుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఉత్తరాదిలోనూ ఈ చిత్రానికి భారీ వసూళ్లు లభిస్తున్నాయని, అక్కడ కూడా ఈ మూవీ రికార్డుల మోత మోగిస్తూ బాలీవుడ్ వర్గాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోందని చెబుతున్నారు.
ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ రోజు నుంచి దర్శకుడు రాజమౌళిపై సర్వత్రా ప్రశంసల వర్ష కురుస్తోంది. మెగా స్టార్ చిరంజీవి నుంచి స్మాల్ స్టార్ ల వరకు.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ నుంచి బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ రణ్ వీర్ సింగ్ వరకు ఇలా ప్రతీ ఒక్కరూ ట్రిపుల్ ఆర్ సినిమాతో పాటు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాజమౌళికి విపరీతంగా కాల్స్ వెళుతున్నాయట. ఆయనని అభినందించాలని, తమతో సినిమాకు ఒప్పించాలని ఇలా రక రకాలుగా చాలా మంది విపరీతంగా జక్కన్నకు ఫోన్ లు చేస్తున్నారట.
అయితే వెకేషన్ మూడ్ లోకి వెళ్లిపోయిన జక్కన్న ఫ్యామిలీతో సహా వికారాబాద్ లోని తన ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యారని, ఎంత మంది ఫోన్ చేసినా ప్రస్తుతం అటెండ్ చేయడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చాలా బిగ్ స్టార్స్ , స్టార్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసినా రాజమౌళి అటెండ్ చేయకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ చర్చగా మారింది.
ట్రిపుల్ ఆర్ తరువాత రాజమౌళి .. సూపర్ స్టార్ మహేష్ తో భారీ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తరువాతే మహేష్ మూవీని జక్కన్న పట్టాలెక్కిస్తారట.