Begin typing your search above and press return to search.
'RRR' టార్గెట్ 'బాహుబలి'..రాసి పెట్టుకోవాల్సిందే!
By: Tupaki Desk | 22 March 2022 10:30 AM GMTఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కి రెడీ అయింది. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లో మొదలైపోయింది. మరి వసూళ్ల టార్గెట్ ఫిక్సైందా? బాక్సాఫీస్ వద్ద `ఆర్ ఆర్ ఆర్` తడాఖా` ఎంత? గ్లోబల్ మూవీగా విదేశీ మార్కెట్లో నిలిస్తే `బాహుబలి` ప్రాంచైజీ రికార్డులు తునా తునకలు కావాల్సిందేనా? ట్రిపుల్ `ఆర్`- `బాహుబలి` అంతకు మించి? రికార్డుల దిశగా దూసుకుపోతుందా? స్టార్ మేకర్ రాజమౌళి- దిగ్గజ రచయిత
విజయేంద్ర ప్రసాద్ త్రయం `బాహుబలి` రికార్డుల దిశగానే `ఆర్ ఆర్ ఆర్` ని దింపుతున్నారా? ఇలా ఎన్నో సందేహాలు ప్రేక్షకాభిమానుల్లో ప్రాజెక్ట్ మొదలైన దగ్గర నుంచి బుర్రల్ని తొలిచేస్తున్నాయి. మరి వాటిని అందుకోవడానికి `ఆర్ ఆర్ ఆర్`కి ఎంత వరకూ ఛాన్సెస్ ఉన్నాయి? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
`బాహుబలి` రిలీజ్ ముందు వరకూ ఎలాంటి అంచనాలు లేవు. 400 కోట్లు ఖర్చు పెట్టిన సినిమా - సాంకేతికంగా సినిమా హైస్టాండర్స్ లో ఉంటుందని ఎవరూ అంచనా వేయలేదు. జక్కన్న క్రియేటివిటీ ఆ రేంజ్లో ఉంటుందని సైతం ఊహకు రాలేదు. రిలీజ్ తర్వాత ఆ ఇద్దరి సత్తా ప్రపంచానికి తెలిసింది. `బాహుబలి` దిబిగినింగ్` అనూహ్యంగా 650 కోట్ల వసూళ్లను సునాయాసంగా రాబట్టింది. `ది బిగినింగ్` మొదటి రోజే 119 కోట్ల వసూళ్లని సాధించింది. ఫుల్ రన్ లో 650 కోట్ల మార్క్ ని చేరుకుంది. మొదటి భాగానికి అయిన ఖర్చు అక్షరాల 125 కోట్లు.
ఇక `బాహుబలి ది కనుక్లూజన్` ఏకంగా 1800 కోట్లకు పైగానే సాధించింది. `దంగల్` 2000 కోట్ల వసూళ్లని సైతం బీట్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేసింది. కానీ సాధ్యం కాలేదు. మొదటి రోజు రెండవ భాగం కూడా 121 కోట్ల వసూళ్లని సాధించింది. `ది కన్ క్లూజన్` కి అయిన ఖర్చు అక్షరాలు 250 కోట్లు. మొత్తంగా రెండు భాగాలకు కలిపి `బాహుబలి ప్రాంచైజికి` 375-400 కోట్లు ఖర్చు అయింది.
సరిగ్గా ఇదే బడ్జెట్ తో `ఆర్ ఆర్ ఆర్` నిర్మాణం జరిగింది. ఇద్దరి విప్లవ యోధుల కథని డ్రెమటైజ్ చేసి తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం దగ్గర నుంచే తండ్రీ-కుమారులు `బాహుబలి`ని టార్గెట్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అంతకు మించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు క్రేజీ హీరోల్ని రంగంలోకి దింపి తెరకెక్కించారు. తెలుగు రాష్ర్టాల పరంగా ఈ ఇద్దరి హీరోల ఇమేజ్ ..క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
వందల కోట్ల వసూళ్లు రాబట్టిన చరిత్ర ఇద్దరి సొంతం. ఇద్దరు కమర్శియల్ చిత్రాలతోనే ఆఫీట్ సాధించగలిగారు. ఇప్పుడు ఏకంగా రాజమౌళి లాంటి మేకర్ తోనే పని చేసారు. ఔట్ ఫుట్ విషయంలో ఆలోచించాల్సిన పనిలేదు. కంటెంట్ పరంగా యూనిక్ గా ఉంటూనే కమర్శియల్ అంశాల్ని హీరోల ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా జొప్పించి ఉంటారని ప్రచార చిత్రాల్ని బట్టే తెలిపోయింది. ఇక ఇప్పటికే రేట్లు హైలో ఉన్నాయి. ఏపీలో పదిరోజుల పాటు టిక్కెట్ ధర దిగదు.
తెలంగాణలో సిటీ పరిధిలోనే ఒక్కో టిక్కెట్ ని భారీగా విక్రయిస్తున్నారు. ప్రీమియర్ల రూపంలో కోట్ల వసూళ్లు సాధించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇంకా `ఆర్ ఆర్ ఆర్` 3డీ ఫార్మెంట్ లోనూ రిలీజ్ చేస్తున్నారు. అందుకు వీక్షకుడు అదనంగా టిక్కెట్ కి చెల్లించాల్సి ఉంది. మెట్రో పాలిటన్ సిటీస్ సహా అమెరికా లో పెద్ద ఎత్తున 3డీకి ఆదరణ దక్కే అవకాశం ఉంది. ఆ రూపంలోనే కోట్లు గుమ్మరించడం ఖాయం. చరిత్ర కారుల కధ కాబట్టి గ్లోబల్ మూవీగా నిలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా ప్రచారం మారుమ్రోగిపోతుంది.
ఆ రకంగా మొత్తం `ఆర్ ఆర్ ఆర్` గ్రాప్ ని పరిశీలిస్తే `బాహుబలి` వసుళ్ల టార్గెట్ గానే దిగుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ ఈ విషయాలు ఓపెన్ కావడం లేదు. అయితే జక్కన్న ఓ సందర్భంలో `ఆర్ ఆర్ ఆర్` ని విదేశీలు చూస్తే గ్లోబల్ మూవీ అవుతుందని హింట్ ఇచ్చారు. `బాహుబలి`ని జపాన్ ఆడియన్స్ ఆదరించారు కాబట్టి అది గ్లోబల్ మూవీ అయిందన్నారు. `ఆర్ ఆర్ ఆర్` విషయంలో డైరెక్ట్ గా ఆ మాట అనలేదు.
ఫలితాన్ని బట్టి జక్కన్న `ఆర్ ఆర్ ఆర్` ఎలాంటి మూవీ అనే విషయాన్ని డిసైడ్ చేస్తారు. ఇప్పటివరకూ అపజయమెరుగని దర్శకుడిగా జక్కన్నకి పేరుంది. `బాహుబలి` సక్సెస్ తో ప్రపంచమే గుర్తించింది. ఆ ఖ్యాతి `ఆర్ ఆర్ ఆర్` సక్సెస్ తో రెట్టింపు అవుతుందని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ టూ జక్కన్న అండ్ కో.