Begin typing your search above and press return to search.
హౌరా బ్రిడ్జ్ సాక్షిగా ట్రిపుల్ ఆర్ హల్ చల్
By: Tupaki Desk | 22 March 2022 8:39 AM GMTట్రిపుల్ ఆర్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమోగుతున్నపేరిది. `బాహుబలి` తరువాత దక్షిణాది నుంచి వస్తున్న సినిమా కావడంతో దేశం మొత్తం ఈ సినిమా పై అటెన్షన్ ని పాటిస్తోంది. అంతే కాకుండా ఇద్దరు క్రేజీ స్టార్ లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన చిత్రం కావడం కూడా ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొనడానికి ప్రధాన కారణంగా మారింది. ఇక ఈ మూవీ కోసం ప్రేక్షకులు, అభిమానులు దాదాపు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తుండంతో ట్రిపుల్ ఆర్ పై సహజంగానే అంచనాలు పెరిగాయి.
ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా చిత్రబృందం దేశ వ్యాప్తంగా సినిమా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. దేశంలో వున్న ప్రధాన నగరాల్లో పర్యటిస్తున్న ట్రిపుల్ ఆర్ బృందం మంగళవారం కోల్ కతాకు చేరింది. అక్కడి హౌరా బ్రిడ్జి సాక్షిగా హల్ చల్ చేసింది. ఈ రోజు ఉదయమే కోల్ కతా చేరుకున్న చిత్ర బృందం హౌరా బ్రిడ్జి ని తిలకించి అక్కడే మీడియాతో ముచ్చటించింది.
రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ ముగ్గురు ఈ రోజు ఉదయమే కోల్ కతా చేరుకుని అక్కడ హల్ చల్ చేయడం మొదలుపెట్టారు.
ఇక్కడ విశేషం ఏంటంటే ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా హైరా బ్రిడ్జ్ సమీపంలో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఈ ముగ్గురు నిలబడే వుండి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా వర్గాలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ నెల 14 నుంచి ప్రచార పర్వాన్ని `ఎత్తర జెండా.. `అంటూ సాగే సెలబ్రేషనల్ లిరికల్ వీడియోతో ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ బుధవారం హైదకరాబాద్ లో జరిగే ప్రత్యేక ఈ వెంట్ తో ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఫైనల్ గా హైదరాబాద్ లో తెలుగు మీడియాతో ముచ్చటించి ప్రమోషన్స్ కి బిగ్ బ్రేక్ ఇవ్వబోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు వివిధ దేశాల్లో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కెనడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కార్ ర్యాలీతో ఎన్టీఆర్ ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.
1920 ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీం గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. కీలక పాత్రల్లో హాలీవుడ్ నటులు రే స్టీవెన్ సన్, ఒలివియా మోరీస్, అలీసన్ డూడీ, అజయ్ దేవగన్, సముద్రఖని నటించారు. రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ మార్చి 25న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.