Begin typing your search above and press return to search.
సిల్క్ స్మితను అలా చూస్తుండిపోయానంతే!
By: Tupaki Desk | 22 March 2022 11:30 PM GMTతెలుగులో ఒకప్పుడు హీరోయిన్స్ గా తెరపై సందడి చేసిన నదియా .. ఆమని .. స్నేహ .. సుహాసిని .. దేవయాని మొదలైన వాళ్లంతా కూడా ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ భారీ పారితోషికాలను అందుకుంటున్నారు. త్వరలో ఆ జాబితాలో మాలాశ్రీ కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. తన స్థాయికి తగిన పాత్రలు .. తనకి నచ్చిన పాత్రలు వస్తే తెలుగులో చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాలాశ్రీ మాట్లాడుతూ .. " కన్నడలో నేను హీరోయిన్ గా నా మొదటి సినిమాను రాఘవేంద్ర రాజ్ కుమార్ తో చేశాను. అప్పుడు నాకు కన్నడ అసలే రాదు. దాంతో నా పాత్రను .. డైలాగ్స్ ను అర్థం చేసుకోవడం కష్టమయ్యేది. భాష తెలిస్తేనే ఎక్స్ ప్రెషన్ ఇవ్వగలుగుతాము. భాష తెలియదు కనుక నన్ను తీసేస్తారేమోనని ప్రతి రోజు ఏడ్చేదాన్ని.
ఆ తరువాత కన్నడ నేర్చుకోవడం మొదలుపెట్టాను. రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ నన్ను తమ ఫ్యామిలీ మెంబర్ గా చూసుకునేవారు. అందువలన నాకు కాస్త ధైర్యం వచ్చింది.
'ప్రేమఖైదీ' సినిమా షూటింగుకి వచ్చేసరికి నేను ఫీవర్ తో బాధపడుతున్నాను. అందువలన నాకు ఎప్పటికప్పుడు జ్యూస్ లు ఇస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ సినిమా హిట్ అయితే నాకూ .. హరీశ్ కి కారు గిఫ్ట్ గా ఇస్తానని రామానాయుడు గారు అన్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా 100వ రోజున బెంగుళూర్ లో మా ఇంటికి ఆయన కొత్త కారును పంపించారు. నాకు ప్రీమియర్ .. హరీశ్ కి కాంటెస్సా పంపించారు. ఆ కారును నేను ఎంతో అపురూపంగా చూసుకునేదానిని.
ఇక 'బావ బావమరిది' సినిమాలో అంతా స్టార్స్. ఒక వైపున కృష్ణంరాజు గారు .. మరో వైపున జయసుధ గారు .. ఇంకో వైపున సుమన్ గారు .. సిల్క్ స్మితగారు. వాళ్లందరితో కలిసి చేసే ఒక అవకాశం నాకు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.
అది మామూలు కాంబినేషన్ కాదు .. లొకేషన్ కళకళలాడుతూ ఉండేది. సిల్క్ స్మిత గారిని ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయేదానిని. ఆమె వాకింగ్ .. ఆమె స్టైల్ భలేగా ఉండేవి. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. తెలుగు నుంచి మంచి పాత్రలు వస్తే చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు.