Begin typing your search above and press return to search.
రౌడీ ఫ్యాన్స్ అసంతృప్తి... అన్ని ఇన్ని అంటారు ఎక్కడ బాసూ?
By: Tupaki Desk | 24 March 2022 7:35 AM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చివరి చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ విడుదల అయ్యి రెండు సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు ఆయన నుండి మరో సినిమా రాలేదు. మద్య లో కరోనా వల్ల సినిమాలు అందరు హీరోలు చేయలేదు. కాని చాలా మంది హీరోలు గత ఏడాది చివరి నుండే తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. కాని రౌడీ స్టార్ మాత్రం తన తదుపరి సినిమా లైగర్ ను ఈ ఏడాది ఆగస్టు లో విడుదల చేయబోతున్నాడు.
వరల్డ్ ఫేమస్ లవర్ కి లైగర్ సినిమాకు దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ ఉండబోతుంది. లైగర్ సినిమా కరోనా వల్ల ఆలస్యం అవుతుందని అభిమానులు సరి పెట్టుకున్నారు. కాని ఆయన తదుపరి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వస్తాయని.. ఏడాదికి రెండు మూడు తీసుకు వస్తాడని అంతా భావించారు. కాని ఆయన తీరు చూస్తుంటే తదుపరి సినిమాలు కూడా ఆలస్యం అవుతాయని అనిపిస్తుంది.
ఇప్పటికే విజయ్ దేవరకొండ లైగర్ ను పూర్తి చేయగా అదే సినిమా దర్శకుడు పూరి జగన్నాద్ దర్శకత్వంలో మరో సినిమాను విజయ్ దేవరకొండ చేయబోతున్నాడు. పూరి జగన్నాద్ ఇప్పటికే శివ నిర్వాన దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుక కమిట్ అయ్యాడు. ఆ సినిమా చాలా కాలం క్రితమే పట్టాలు ఎక్కాల్సి ఉన్నా కూడా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇక సుకుమార్ మరియు విజయ్ దేవరకొండల కాంబోలో కూడా ఒక సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.
పుష్ప 2 సినిమా ఆలస్యం అవ్వబోతున్న నేపథ్యం లో విజయ్ దేవరకొండ.. సుకుమార్ ల సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్యాప్ లో శివ నిర్వాన దర్శకత్వంలో విజయ్ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందంటున్నారు. మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై క్లారిటీ రాలేదు కాని ఇద్దరి కాంబో దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.
విజయ్.. కొరటాల శివ కాంబో మూవీ ఎప్పుడు ఉంటుంది అనే విషయం లో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై కూడా అధికారికంగా ప్రకటన రాలేదు. కాని చర్చలు అయితే జరుగుతున్నాయి అంటూ సమాచారం అందుతోంది.
ఇన్ని సినిమాలకు కమిట్ అయిన విజయ్ దేవరకొండ సినిమాలు ఏ ఒక్కటి కూడా ఇప్పుడు పట్టాలు ఎక్కలేదు. ఈ ఏడాది లైగర్ మినహా మరే సినిమా వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. దాంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరైన ప్లానింగ్ తో రౌడీ స్టార్ వ్యవహరించడం లేదని.. ఇన్ని అన్ని సినిమాలు ఆయన నుండి వస్తాయని అంటున్నారు కాని అవి ఎక్కడ... ఎప్పుడు వస్తాయి అనేది తెలియడం లేదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.