Begin typing your search above and press return to search.

#NTR30 : అంతా రెడీ ఇక ఆరంభమే

By:  Tupaki Desk   |   7 Sep 2021 6:46 AM GMT
#NTR30 : అంతా రెడీ ఇక ఆరంభమే
X
ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్‌ తర్వాత చేయబోతున్న సినిమా కొరటాల శివ దర్శకత్వంలో అనేది ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది. అయితే కరోనా ఇతరత్ర కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతుంది. ఎన్టీఆర్‌ మరియు కొరటాల కాంబోలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ అన్నట్లుగా సినిమా చిత్రీకరణ ప్రారంభంకు రంగం సిద్దం అయ్యిందని యూనిట్‌ సభ్యుల నుండి సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ తన ఆర్ ఆర్ ఆర్‌ ను ముగించుకున్నాడు. అలాగే కొరటాల శివ ఆచార్య ను కూడా దాదాపుగా పూర్తి చేశాడు. కనుక వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కడమే తరువాయి.

ఎన్టీఆర్ మరియు కొరటాల శివల కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు కొరటాల శివ తనదైన శైలిలో సినిమా కథ మరియు స్క్రిప్ట్‌ ను రాసుకున్నాడట. మెసేజ్ తో పాటు మంచి ఎంటర్‌ టైన్ మెంట్‌ కూడా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. జనతా గ్యారేజ్ తరహాలోనే ఒక మంచి సోషల్‌ మెసేజ్ ను ఈ సినిమాలో కొరటాల శివ చూపించబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యుల్లో ఒకరు పేర్కొన్నారు. కావాల్సినంత సమయం కొరటాల శివకు దక్కిన కారణంగా ఎన్టీఆర్‌ 30 కోసం స్క్రిప్ట్‌ విషయంలో ఎక్కువ శ్రద్ద పెట్టారు అని కూడా టాక్ వినిపిస్తుంది.

ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయిన ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే వారంలో రాబోతుంది. రెగ్యులర్ షూటింగ్‌ కూడా అక్టోబర్ లోనే మొదలు అవుతుందని అంటున్నారు. మేకర్స్ చెబుతున్నదాని ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను వచ్చే సమ్మర్ వరకు ముగించి విడుదల చేయాలని భావిస్తున్నారట. అందుకోసం చకచక వర్క్ జరుపుతున్నారు. కొరటాల శివ మేకింగ్‌ చాలా స్పీడ్‌ గా ఉంటుంది.

ఆయన పక్కా ప్లానింగ్‌ తో సినిమా ను మొదలు పెట్టి చకచక షూటింగ్ ను పూర్తి చేస్తారు కనుక ఎన్టీఆర్‌ 30 మరీ ఎక్కువ ఆలస్యం కాకుండా ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్‌కు అంతా రెడీ మొదలు అయితే చకచక ముగించడమే ఉంటుంది. కనుక కొరటాల ఎప్పుడు మొదలు పెడతాడు అనేది చూడాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ లేదా పూజా హెగ్డే ను ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు. ఆ విషయమై త్వరలోనే స్పష్టత వస్తుందేమో చూడాలి.