Begin typing your search above and press return to search.
పుష్ప ది రూల్ మొదలయ్యేది అప్పుడేనా?
By: Tupaki Desk | 4 July 2022 7:50 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'పుష్ప'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా వైరల్ గా మారి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీ హిందీలో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి విస్మయానికి గురిచేసింది.
ఎలాంటి ప్రచారం లేకుండానే అక్కడ రూ. 100 కోట్లకు మించి రాబట్టి హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా వుంటే ఈ మూవీకి సీక్వెల్ గా 'పుష్ప2' రూపొందనున్న విషయం తెలిసిందే. పుష్పరాజ్ పెళ్లి సీన్ తో 'పుష్ప' పార్ట్ 1 కి శుభం కార్డ్ వేశారు. పార్ట్ 2 ని మరిన్ని ప్రత్యేకతలతో ఊహించని ఘట్టాలతో తెరపైకి తీసుకురానున్నారట. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కి మించి బడ్జెట్ ని కేటాయించిన మేకర్స్ పార్ట్ 2పై అంచనాల్ని పెంచేశారు. 'కేజీఎఫ్ 2' రికార్డు స్థాయి విజయాన్ని దృష్టిలో పెట్టుకుని కథలో భారీ మార్పులు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక రష్మీక పాత్రని కంటిన్యూ చేస్తూనే మరో క్రేజీ హీరోయిన్ ని రంగంలోకి దించబోతున్నారట. ఫహద్ చెల్లెలి పాత్రలో మరో క్రేజీ హీరోయిన్ ని ఈ మూవీ కోసం ఎంపిక చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఫస్ట్ పార్ట్ లో డేట్స్ కారణంగా మిస్సయిన విజయ్ సేతుపతిని సెకండ్ పార్ట్ కోసం రంగంలోకి దింపేస్తున్నారని, ఇప్పటికే దర్శకుడు సుకుమార్ ఆయనతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ విషయంలో కొన్ని రోజులుగా కఫ్యూజన్ మొదలైంది. జూలైలో స్టార్ట్ అవుతుందని, లేదు ఆగస్టులో అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మేకర్స్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జూలై.. ఆగస్టులో కాకుండా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్టుగా మేకర్స్ ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. పార్ట్ 2 లో చాలా మంది కొత్త నటీనటులని మేకర్స్ పరిచయం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఆడిషన్స్ ఇటీవలే మొదలయ్యాయి.
అంతే కాకుండా స్క్రిప్ట్ వర్క్ కూడా ఫైనల్ స్టేజ్ కి చేరిందట. ఫస్ట్ పార్ట్ కి మంచి భారీ స్కేల్ లో ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే భారీ సెట్ ల నిర్మాణం ప్రారంభించనున్నారట. అంటే కాకుండా లొకేషన్ ల హంట్ కూడా మొదలు పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్నుంచి ప్రారంభించాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా డిసెంబర్ సెంటిమెంట్ గా భావిస్తున్న చిత్ర బృందం ఈ మూవీని వచ్చే ఏడాది డిసెంబర్ కే ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్.