Begin typing your search above and press return to search.
సక్సెస్ అంటే ఇదీ .. సాధించి చూపించిన అజిత్!
By: Tupaki Desk | 14 March 2022 11:30 PM GMTహీరో అంటే అవినీతిపరుల నుంచి .. దుర్మార్గుల నుంచి సమాజాన్ని రక్షించేవాడు. బలవంతుల దౌర్జన్యం నుంచి బలహీనులను కాపాడేవాడు. తాను సరైనా మార్గంలో ప్రయాణం చేస్తూ, తన చుట్టూ వాళ్లకి స్ఫూర్తిగా నిలిచేవాడు. అలాంటి లక్షణాలు ఉన్నవారు తెరపై మాత్రమే కాదు .. తెర వెనుక కూడా హీరోలే. అయితే అక్షరాలా అజిత్ రియల్ హీరోనే. నటన పరంగాను .. వ్యక్తిత్వం పరంగాను ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అజిత్, మన సికింద్రాబాద్ కుర్రాడే. కోలీవుడ్ కి వెళ్లి అక్కడ ఈ స్థాయిలో చక్రం తిప్పడం మాటలు కాదుగా!
తెలుగులో అజిత్ 'ప్రేమపుస్తకం' అనే సినిమాను చేశాడు. గొల్లపూడి మారుతీరావు కుమారుడు శ్రీనివాసరావు ఆ సినిమాకి దర్శకుడు. ఆ సినిమా షూటింగు సమయంలో జరిగిన ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఆ తరువాత గొల్లపూడి మారుతీరావు ఆ సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమా తరువాత అజిత్ కి తెలుగు నుంచి పెద్దగా అవకాశాలు రాలేదు.
దాంతో ఆయన తమిళ సినిమాలపై దృష్టి పెట్టారు. అప్పుడు అక్కడ కూడా విపరీతమైన పోటీ ఉంది. అయినా అక్కడ ఆయన ధైర్యంగా ముందుకు వెళ్లారు. టాలెంట్ .. కష్టం .. అదృష్టం ఆయనను స్టార్ హీరోల కేటగిరీలోకి చేర్చాయి.
ఇక అప్పటి నుంచి ఇప్పటివరకూ కూడా ఆయన తన క్రేజ్ ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఎదుటి వ్యక్తిని తక్కువగా చూడకపోవడం .. ఎలాంటి పరిస్థితుల్లోను ఎవరినీ విసుక్కోకపోవడం ఆయనలోని గొప్ప గుణాలని అంతా చెబుతుంటారు. ఇక ఒక సినిమా చేసి ఆ సినిమా టీమ్ తో అంతటితో సంబంధాలు తెంపుకోవడం ఆయనకి నచ్చని విషయం. అంతా కలిసి ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలని ఆయన కోరుకుంటారు. తన సినిమాల కారణంగా దెబ్బ తిన్న దర్శక నిర్మాతలను తిరిగి ఆదుకున్న హీరోగా ఆయనకి మంచి పేరు ఉంది.
అజిత్ తో ఒక సినిమా చేస్తే మరో సినిమా వెతుక్కోవలసిన పనిలేదు. మళ్లీ ఆయనే మరో ఛాన్స్ ఇస్తుంటారు. ఎన్నో భారీ విజయాలను అందుకున్న ఆయన, ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆయన ఒక మెసేజ్ పెట్టారు. "ఫ్యాన్స్ .. హేటర్స్ .. న్యూట్రల్స్ ఒకే నాణానికి మూడు వైపులా ఉంటారు.
ఫ్యాన్స్ నుంచి ప్రేమను .. హేటర్స్ నుంచి ద్వేషాన్ని .. న్యూట్రల్స్ నుంచి నిష్పాక్షిక అభిప్రాయాలను నేను స్వీకరిస్తున్నాను. జీవించండి .. జీవించనీయండి .. అన్ కండిషనల్ లవ్ ఫర్ ఎవర్ .. మీ అజిత్ కుమార్" అంటూ రాసుకొచ్చారు. ఈ నోట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అజిత్ .. వినోద్ దర్శకత్వంలోనే మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.