Begin typing your search above and press return to search.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి మరో సర్ ప్రైజ్ రెడీ
By: Tupaki Desk | 3 March 2022 9:30 AM GMTమూడున్నరేళ్ల విరామం తరువాత రీమేక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన నటించిన `వకీల్ సాబ్` బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ `పింక్` ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టిన ఈ మూవీ పవన్ కు గుడ్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్ తో పవన్ మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా పవన్ చేసిన చిత్రం `భీమ్లానాయక్`.
ఒరిజినల్ కి భిన్నంగా మార్పులు చేసి తీసిని ఈ మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. గత నెల 25న వరల్డ్ వైడ్ గా విడుదలైన `భీబ్లానాయక్` వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సాధిస్తూ ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రానా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు.
`భీమ్లానాయక్` అనూహ్య విజయాన్ని సాధిస్తున్న నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా సెలబ్రేషన్స్ మోడ్ లోకి వెళ్లిపోయిన ఫ్యాన్స్ కి పవన్ కల్యాణ్ మరో సర్ ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. వరుసగా రీమేక్ లు కలిసి వస్తుండటంతో పవన్ మరోసారి కూడా రీమేక్ సినిమానే ఎంచుకోవడం విశేషం. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన బ్యానర్ పై తమిళ హిట్ మూవీ `వినోదాయ సితం` రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు.
దీని బాధ్యతల్ని కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు అప్పగించారట. ఈ చిత్రాన్ని తమిళంలో సముద్రఖని నటించి తెరకెక్కించాడు. దీంతో ఆయననే డైరెక్టర్ గా ఫైనల్ చేసుకున్న పవన్ టీమ్ త్రవిక్రమ్ నేతృత్వంలో స్క్రిప్ట్ లో మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ అంటూ నెట్టింట మరో న్యూస్ వైరల్ గా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే త్వరలోనూ ఈ మూవీని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని పవన్ - త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా ఈ చిత్రంలో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ పాత్ర నిడివిని తాజాగా పెంచారని, ఇందుకు సంబంధించిన మార్పులు ఇప్పటికే మొదలు పెట్టారని సమాచారం. `హరి హర వీరమల్లు` ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే పవన్ కల్యాణ్ `వినోదాయ సితం` రీమేక్ ని సముద్ర ఖని డైరెక్షన్ లో పట్టాలెక్కిచడం ఖాయం అని చెబుతున్నారు.