Begin typing your search above and press return to search.

#రాధే శ్యామ్.. ట్రైలర్ లో త‌ప్పును దిద్దారు!

By:  Tupaki Desk   |   3 March 2022 5:35 AM GMT
#రాధే శ్యామ్.. ట్రైలర్ లో త‌ప్పును దిద్దారు!
X
ఎట్టకేలకు రాధే శ్యామ్ విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందే చాలా కాలంగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ముంబైలోని పివిఆర్ జుహులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మేకర్స్ దీనిని ఆవిష్కరించారు. కానీ సాయంత్రం తెలుగు ట్రైలర్ లో పొరపాటు జరగడంతో మేకర్స్ దానిని తొల‌గించి మళ్లీ అప్ లోడ్ చేశారు.

పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా రాధేశ్యామ్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కానీ తెలుగు ట్రైలర్ లో అతని స్థానంలో తమిళంలో కృష్ణంరాజు పాత్రను పోషిస్తున్న సత్యరాజ్ క‌నిపించి షాకిచ్చారు. నెటిజన్లు వెంట‌నే ప‌సిగ‌ట్టి దాన్ని ఎత్తి చూపడంతో మేకర్స్ తప్పును సరిదిద్దారు. సరిదిద్దిన కొత్త ట్రైల‌ర్ ని ఆ త‌ర్వాత‌ అప్ లోడ్ చేశారు.

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం తెలుగు- తమిళం- మలయాళం- హిందీ- కన్నడ భాషల్లో11 మార్చి 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ప్ర‌భాస్ జాగ్ర‌త్త‌లు పెద్ద ప్ల‌స్..!

రాధేశ్యామ్ విడుద‌ల‌కు కేవ‌లం కొద్ది రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. అంత‌కుముందు అన్ని ఏర్పాట్ల‌తో టీమ్ సిద్ధ‌మ‌వుతోంది. సినిమా మొత్తం పూర్త‌యిన త‌ర్వాత రిలీజ్ వెర్ష‌న్ కాపీ చూసి అందులో మార్పులు.. చేర్పులు కోరే హీరోలు టాలీవుడ్ లో కొంద‌రు ఉన్న సంగ‌తి తెలిసిందే. పెద్ద హీరోలు తుది కాపీ ఒక‌టికి రెండుసార్లు క్రాస్ చెక్ చూసుకుంటున్నారు. ఎడిటింగ్ వెర్ష‌న్ లో మార్పులు ఏమైనా చేయాల్సి ఉంటే ద‌ర్శ‌కుడికి సూచిస్తుంటారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ `రాధేశ్యామ్` విష‌యంలో అంతే కేర్ తీసుకున్నారు.

ఈ సినిమా రిలీజ్ వెర్ష‌న్ ని మ‌రింత బెటర్ మెంట్ చేశార‌ని టాక్ వినిపించింది. ప్ర‌భాస్ చూసి స్వ‌యంగా చిన్న‌పాటి మార్పులు చేయించారని గుస‌గుస వినిపించింది. స్క్రీన్ ప్లే మ‌రింత క్రిస్పీగా ఉండేలా ఎడిట్ ప్యాట‌ర్న్ లో కొన్ని మార్పులు చేయ‌మ‌ని డార్లింగ్ డైరెక్టర్ కి సూచించిన‌ట్లు స‌మాచారం. నిడివి త‌గ్గించ‌డానికి వీలైనంత ట్రిమ్ చేశార‌ట‌.

ప్ర‌భాస్ ద‌గ్గ‌రుండి ప్ర‌తిదీ కేర్ తీసుకుని ఈ సినిమాని హిట్ చేసేందుకు త‌పిస్తున్నార‌ని టాక్ వినిపించింది. ఇక రాజ‌మౌళి నుంచి అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు తీసుకోవ‌డంతో మూవీ మ‌రింత గ్రిప్పింగ్ గా వ‌చ్చింద‌న్న టాక్ వినిపిస్తోంది.