Begin typing your search above and press return to search.

యూఎస్ బాక్సాఫీస్ లో కొత్త ట్రెండ్..!

By:  Tupaki Desk   |   3 March 2022 12:30 AM GMT
యూఎస్ బాక్సాఫీస్ లో కొత్త ట్రెండ్..!
X
కరోనా నేపథ్యంలో ఓవర్ సీస్ మార్కెట్ కుదేలైపోయింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ మెల్లగా పుంజుకుంటోంది. ఇప్పటి వరకు బిగ్ స్టార్ హీరోల చిత్రాలను చూడటానికి యూఎస్ఏలోని సినీ ప్రేమికులు ఆసక్తి చూపించేవారు. అయితే ఇటీవల కాలంలో పాటలు మరియు ట్రైలర్‌ తో మంచి బజ్ క్రియేట్ చేసిన చిన్న సినిమాలను కూడా ఆదరిస్తున్నారు.

ప్రమోషనల్ కంటెంట్ తో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షించిన 'డీజే టిల్లు' చిత్రం యునైటెడ్ స్టేట్స్‌ లో మంచి వసూళ్ళు రాబట్టింది. అలానే 'భీమ్లా నాయక్' సినిమా కూడా సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటోంది. రాబోయే రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న బజ్ కలిగిన సినిమాలన్నీ యూఎస్ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది.

అక్కడ గురువారం ప్రదర్శించే ఎర్లీనూన్ ప్రీమియర్ షోలకు వచ్చే ఫస్ట్ టాక్ ని బట్టే సినిమాకు వచ్చే ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటాయి. మొదటి షో టాక్ డీసెంట్‌ గా ఉంటే ప్రీమియర్ సేల్స్ మరియు అడ్వాన్స్ బుకింగ్స్ పెంచడంలో సహాయపడుతుంది.

శర్వానంద్ - రష్మిక మందన్నా కలిసి నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ప్రీమియర్లు ఈ వారం వేయబోతున్నారు. ఇదే క్రమంలో 'రాధేశ్యామ్' 'ఆర్.ఆర్.ఆర్' 'కేజీఎఫ్ 2' 'ఆచార్య' 'ఎఫ్ 3' 'సర్కారు వారి పాట' వంటి పలు పెద్ద చిత్రాల ఎర్లీ ప్రీమియర్ షోలు పడబోతున్నాయి.

యూఎస్‌లో ఎర్లీ ప్రీమియర్ అంటే దాదాపు 12 గంటలకు షోలు ప్రారంభమవుతాయి. 3 - 4 గంటలకల్లా టాక్ మరియు రివ్యూలు వచ్చేస్తాయి. గతంలో యుఎస్ ప్రీమియర్‌లు 5-6 గంటలకు ప్రదర్శించబడేవి. మూడు గంటల తర్వాత టాక్ మరియు రివ్యూలు వచ్చేవి.

ఎర్లీ నూన్ ప్రీమియర్‌ల ట్రెండ్ ఇకపై అన్ని చిత్రాలకూ కొనసాగే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ నుండి టాక్ వినిపిస్తోంది. రాబోయే పెద్ద సినిమాలతో పాటుగా పలు మీడియం రేంజ్ చిత్రాలు - క్రేజీ సినిమాలు యూఎస్ లో భారీ వసూళ్లు అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.