Begin typing your search above and press return to search.

ఈమోజీ ఎక్స్‌ ప్రెషన్స్ తో చంపేస్తున్న శ్రీవల్

By:  Tupaki Desk   |   28 Feb 2022 10:35 AM GMT
ఈమోజీ ఎక్స్‌ ప్రెషన్స్ తో చంపేస్తున్న శ్రీవల్
X
సౌత్ స్టార్‌ హీరోయిన్ రష్మిక హీరోయిన్‌ కాస్త పుష్ప సినిమా బ్లాక్ బస్టర్‌ సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది. సౌత్ నార్త్‌ అనే తేడా లేకుండా ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌ లో ఈమె నటించిన సినిమా లు రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో వైపు ఈమె శర్వానంద్‌ తో కలిసి నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా ఘన విజయం ను తెచ్చి పెట్టబోతుందనే నమ్మకంతో అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

శ్రీవల్లి కాస్త ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కోసం కొత్తగా డీసెంట్‌ లుక్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎక్స్‌ ప్రెషన్స్ ను ఎప్పుడు కూడా చాలా క్యూట్‌ గా ఇచ్చే రష్మిక మందన్నా ఈమోజీ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈమద్య కాలంలో వాట్సప్‌.. ఇన్‌ స్టా.. స్నాప్‌ ఇలా ఎక్కడ చూసినా కూడా జనాలు ఈమోజీలతో మాట్లాడేసుకుంటూ ఉన్నారు.

నవ్వుకు.. ఏడుపుకు.. ఇరిటేషన్‌ కు ఇంకా రకరకాల ఎక్స్ ప్రెషన్స్ కు మరియు ఫీలింగ్స్ కు కూడా ఈమోజీలు ఉన్నాయి. అందులో కొన్ని ఈమోజీలను తన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో రష్మిక మందన్నా ట్రై చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె ఈమోజీ ఎక్స్ ప్రెషన్స్ ను సోషల్‌ మీడియాలో అభిమానులు మరియు ప్రేక్షకులు తెగ షేర్‌ లు చేస్తూ తాము చాటింగ్‌ చేసే సమయంలో రష్మిక ఈమోజీ ఎక్స్‌ ప్రెషన్స్ ను షేర్‌ చేస్తున్నారు.

రష్మిక ఎక్స్‌ ప్రెషన్స్ తో చంపేస్తుందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఈమె గురించి ఎప్పుడు ఏదో ఒక టాపిక్‌ ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్ ప్రెషన్స్ ట్రెండ్‌ అవుతున్నాయి.

పుష్ప పార్ట్‌ 1 ఘన విజయం సాధించిన నేపథ్యంలో పుష్ప అంతకు మించి అన్నట్లుగా ఉండేలా పుష్ప పార్ట్‌ 2 లో కనిపించబోతుంది. పుష్ప.. శ్రీవల్లి పెళ్లి అయ్యింది కదా ఇంకా సినిమాలో శ్రీవల్లి పాత్రకు పెద్దగా ఉండదేమో అనే అనుమానాలు వ్యక్తం చేసే వారు కూడా ఉన్నారు.

కేవలం పుష్ప 2 మాత్రమే కాకుండా ఇక ముందు రాబోతున్న ప్రతి ఒక్క సినిమా తో కూడా ఈ అమ్మడు ప్రేక్షకులను అంతకంతకు ఎంటర్‌ టైన్ చేయడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రమోషన్ లో యాక్టివ్‌ గా పాల్గొంటున్న ఈమె త్వరలోనే ఒక తమిళ సినిమా షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతుందట. కన్నడంలో కూడా ఈమె ఇటీవలే ఒక సినిమాకు కమిట్‌ అయ్యిందట.