Begin typing your search above and press return to search.

బ‌రాబ‌రి చిన్న‌వాడితో డేటింగ్ చేస్తా

By:  Tupaki Desk   |   23 April 2022 10:34 AM GMT
బ‌రాబ‌రి చిన్న‌వాడితో డేటింగ్ చేస్తా
X
బాలీవుడ్ ప్రేమాయణాలు నిత్యం వార్త‌ల్లో నిలుస్తుండ‌టం తెలిసిందే. కొన్ని పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళ్లితే కొన్ని బ్రేక‌ప్ లు గా మారుతుంటాయి. అదే స‌మ‌యంలో కొన్ని ప్రేమ జంట‌లు మారుతుంటాయి కూడా. ఇక్క‌డ లేటు వ‌య‌సు ప్రేమాయ‌ణాలు స‌ర్వ‌సాధార‌ణ‌మే. బోనీ క‌పూర్‌, శ్రీ‌దేవిల ప్రేమ‌క‌థ అలా పుట్టిందే. పెళ్లైనా కూడా బోనీ క‌పూర్ ,.. శ్రీ‌దేవిని రెండో పెళ్లి చేసుకోవ‌డం అప్ప‌ట్లో బాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా నిలినింది. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు అర్జున్ క‌పూర్ ప్రేమాయ‌ణం కూడా సంచ‌ల‌నంగా మారింది.

త‌న‌కంటే వ‌య‌సులో 12 ఏళ్లు పెద్ద‌దైన మ‌లైకా అరోరాతో అర్జున్ క‌పూర్ గ‌త కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కార‌ణంగానే మ‌లైకా కు స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు అర్భాజ్ ఖాన్ విడాకులు ఇచ్చేశాడు. ఆ త‌రువాత నుంచి అర్జున్ క‌పూర్‌, మ‌లైకా అరోరా బాహాటంగానే తిరుగుతూ డేటింగ్ లో వుంటున్నారు. త‌న క‌న్నా చిన్న వాడితో డేటింగ్ ఏంట‌ని తాజాగా మ‌లైకా అరోరాని నెటిజ‌న్స్ నిల‌దీస్తే దిమ్మ‌దిరిగే ఆన్స‌ర్ ఇచ్చింది. బ‌రాబ‌రి చిన్న‌వాడితో డేటింగ్ చేస్తా త‌ప్పేంది అంటూ ఎదురు ప్ర‌శ్నిస్తోంది.

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన‌ 'దిల్ సే' చిత్రంలో 'ఛ‌ల్ చయ్య చ‌య్యా..' అంటూ సాగే ప్ర‌త్యేక గీతంతో కెరీర్ ప్రారంభించిన మ‌లైకా అరోరా ఆ త‌రువాత కూడా అదే త‌ర‌హా పాట‌ల్లో మెరిసింది. ఇప్ప‌టికీ అదే త‌ర‌హా ప్ర‌త్యేక గీతాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచింది. ప్ర‌స్తుతం ఓ రియాలిటీ షోకు న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌లైకా గ‌త కొన్నేళ్లుగా త‌న కంటే 12 ఏళ్లు చిన్న‌వాడైన యంగ్ హీరో అర్జున్ క‌పూర్ తో ప్రేమాయ‌ణం సాగిస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది.

గ‌త కొంత కాలంగా డేటింగ్ లో వుంటున్న ఈ జంట‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా వినిపించ‌ని కామెంట్ లు లేవు. తాజాగా ఓ నెటిజ‌న్ లు నేరుగా మ‌లైకాకే దిమ్మ‌దిరిగే ప్ర‌శ్న సంధించారు. '12 ఏళ్లు చిన్న‌వాడైన అబ్బాయితో ఎలా రిలేష‌న్ లో వున్నావు' అని ప్ర‌శ్నించారు. ఈ కామెంట్ ల‌ని సీరియ‌స్ గా తీసుకున్న మ‌లైకా తాజాగా వీటిపై స్పందించింది. తాజాగా ఓ ఆన్ లైన్ పోర్ట‌ల్ కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో మ‌లైకా త‌న‌పై వ‌స్తున్న తాజా కామెంట్ ల‌పై స్పందించింది.

'ఒక మ‌హిళ త‌న‌కంటే వ‌య‌సులో చిన్న‌వాడైన వ్య‌క్తితో రిలేష‌న్ లో వుంటే ఈ స‌మాజం ఎందుకు త‌ప్పుగా చూస్తోంది. అందులో త‌ప్పేముంది?. బ్రేక‌ప్ లేదా విడాకుల త‌రువాత ఒక మ‌హిళ తన‌కంటూ ఓ జీవితాన్ని క్రియేట్ చేసుకోవాలి. స్వ‌శ‌క్తితో ముంద‌డుగు వేయాలి. ధైర్యంగా ఎలా జీవించాలో మా అమ్మ నుంచి ప్రేర‌ణ పొందాను.

నీకిష్టం వ‌చ్చిన‌ట్లు నువ్వు జీవించు. ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కు.. నీకు ఏం చేయాల‌నిపిస్తే అది మ‌న‌స్ఫూర్తిగా చేసేయ్‌' అని మా అమ్మ ఎప్పుడూ చెబుతూ వుండేది. ఆ మాట‌ల్నే నేను ఎక్కువ‌గా న‌మ్ముతుంటాను' అని తెలిపింది మ‌లైకా. త‌న స‌మాధానం ఎలా వుందంటే బ‌రాబ‌ర్ చిన్న‌వాడితో నాకు న‌చ్చిన వాడితో డేటింగ్ చేస్తా అనే స్థాయిలో వుండ‌టం గ‌మ‌నార్హం.