Begin typing your search above and press return to search.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆ జంటను వేరు చేసింది!

By:  Tupaki Desk   |   21 March 2022 2:30 AM GMT
మ్యాచ్ ఫిక్సింగ్ ఆ జంటను వేరు చేసింది!
X
ఈమద్య కాలంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ మరియు స్టార్‌ క్రికెటర్ ల ప్రేమాయణం.. ఆ తర్వాత పెళ్లి తంతు వార్తలు రెగ్యులర్‌ గా వింటున్నాం. విరాట్ కోహ్లీ మొదలుకుని పలువురు టీమ్ ఇండియా క్రికెటర్లు బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీస్ ప్రేమలో పడి మునిగి తేలారు. ఈమద్య కాలంలోనే కాకుండా గత మూడు నాలుగు దశాబ్దాలుగా కూడా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న లవ్‌ స్టోరీ మూడు దశాబ్దాల క్రితం జరిగింది.

అది 1990 సంవత్సరం.. ఒక మ్యాగజైన్ కవర్ పేజీ ఫోటో షూట్‌ కోసం అప్పటి టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్‌ అజయ్‌ జడేజా ఒక స్టూడియో కు వెళ్లాడు. అక్కడ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఉన్నారు. ఆమె గురించి అంతకు ముందే అజయ్‌ కి తెలుసు.. కేవలం తెలవడం మాత్రమే కాదు ఆమె సినిమాలన్నీ కూడా చూసి వీరాభిమానిగా మారాడు. ఆ విషయాన్ని అక్కడ వారు చర్చించుకున్నారు. అజయ్ కూడా అప్పటికి స్టార్‌ క్రికెటర్ అవ్వడంతో మాధురి దీక్షిత్‌ అతడికి సన్నిహితంగా ఉండేది.

మాధురీ దీక్షిత్‌ తో అజయ్‌ జడేజా స్నేహం మెల్ల మెల్లగా ప్రేమగా మారింది. ఆ సమయంలోనే అజయ్ జడేజా ఇంట్రెస్ట్ ను గ్రహించి హీరోగా పరిచయం చేసేందుకు తనకు సన్నిహితులు అయిన ఫిల్మ్‌ మేకర్స్ ను రిక్వెస్ట్ చేసింది. అజయ్ జడేజా మరియు మాధురి దీక్షిత్ ల ప్రేమ వ్యవహారం అలా అలా సాగుతున్న సమయంలోనే అనూహ్యంగా టీమ్‌ ఇండియాను కుదిపేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్ వ్యవహారం బయట పడింది.

ఆ మ్యాచ్ ఫిక్సింగ్ లో అజయ్ జడేజా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడు తాను నిర్ధోషిని అంటూ మాధురి వద్ద చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశాడు. అతడి యొక్క మాటను నమ్మిన మాధురీ దీక్షిత్‌ ప్రేమను కంటిన్యూ చేసింది. కాని అజయ్ జడేజా కుటుంబ సభ్యులు సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయితో పెళ్లికి అంగీకరించలేదు. దాంతో ఇద్దరి ప్రేమ వ్యవహారం కాస్త వివాదాస్పదంగా మారింది.

కుటుంబ సభ్యులను ఎదిరించి అజయ్‌ జడేజా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలోనే అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌ కు పాల్పడ్డట్లుగా నిరూపితం అయ్యింది. ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవడం తో మాధురి దీక్షిత్‌ ఆయనకు దూరం అయ్యింది. మాధురి దీక్షిత్‌ కుటుంబ సభ్యులు అతడితో అస్సలు కలిసేందుకు ఒప్పుకోలేదు. దాంతో ఇద్దరి ప్రేమ బ్రేకప్‌ అయ్యింది.

అజయ్ జడేజా కి ముందు మాధురి దీక్షిత్‌ బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్ దత్‌ ప్రేమలో పడింది. ఆయన కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లడం వల్ల బ్రేకప్ అయ్యింది. ఆయన ప్రేమ నుండి బయట పడుతున్న సమయంలోనే అజయ్‌ జడేజాతో పరిచయం.. అది కాస్త ప్రేమగా మారింది. కాని మ్యాచ్ ఫిక్సింగ్‌ కారణంగా ఆ ప్రేమ కూడా పెటాకులు అయ్యింది.

అజయ్ జడేజా తో బ్రేకప్ తర్వాత మాధురి దీక్షిత్ ఎన్నారై అయిన డాక్టర్‌ శ్రీరామ్ ను పెళ్లి చేసుకుని సెటిల్‌ అయ్యింది. అజయ్ జడేజా కూడా జయ ను పెళ్లి చేసుకుని సెటిల్‌ అయ్యారు. వీరిద్దరి ప్రేమ చాలా తక్కువ కాలం సాగినా కూడా చాలా సంచలనంగా అప్పట్లో చర్చించుకునే వారు.