Begin typing your search above and press return to search.
నిజమైన బాలీవుడ్ క్వీన్ అంటే అలియానే
By: Tupaki Desk | 2 March 2022 6:37 AM GMTబాలీవుడ్ రీజియన్ లో హీరోయిన్ల పారితోషికాలు తక్కువని గళమెత్తిన నాయికలు కొందరున్నారు. ఈ విషయంలో కంగన ఎప్పటికప్పుడు మండిపడుతోంది. పురుషలతో తామెందుకు సమానం కాదో చెప్పాలంటూ డిమాండ్ చేసిన సందర్భాలు కోకొల్లలు.
వాళ్ల తో సమాన పారితోషికాలు మాకెందుకు ఇవ్వరని దర్శక..నిర్మాతలపై చాలాసార్లు యుద్దం ప్రకటించింది. కానీ సాధ్యం కాలేదు. నిజానికి కంగన వ్యాఖ్యల్లో అర్ధం ఉంది. బాలీవుడ్ హీరోలు పారితోషికంతో పాటు..లాభాల్లో షేరు తీసుకుంటారు. కొందరు పారితోషికానికి బధులుగా సినిమా వసూళ్లలో భాగం కోరతారు. ఆ ప్రాతిపదికనే అక్కడ దర్శక-నిర్మాతలు సినిమాలు చేస్తారు.
ఇదే అవకాశం తమకి కల్పించాలని కంగనలాంటి ధైర్యవంతులు అడిగే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. బాలీవుడ్ లో వివక్షకు గురవుతున్నామని కంగన సందర్భం దొరికనప్పుడల్లా కడిగేస్తుంటుంది. అందుకే బయట బ్యానర్లో సినిమాల కంటే తనే నిర్మాతగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అందుకే బాలీవుడ్ క్వీన్ అనే బిరుదు కూడా దక్కింది. `క్వీన్` సినిమాతోనే ఆమెకు ఈ బిరుదు వచ్చేందనుకుంటే పొరపాటే. కంగనలో వ్యక్తిగత పోరాట పటిమ..ప్రశ్నించే విధానం వంటివి కంగనని ఆ స్థానంలో నిలబెట్టాయి.
అయితే ఇప్పుడు అలియాభట్ ని చూసి మిగతా హీరోయిన్లు అంతా కుళ్లుకునే సన్నివేశం ఎదురైందని గుసగుస వినిపిస్తోంది. ఇటీవలే ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన `గంగూబాయి కతియావాడీ` ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సినిమా బ్లాక్ బస్టర్ అయింది. గంగూబాయి అలియాకి కొత్త ఇమేజ్‌ని తీసుకొచ్చింది. ఆమె బ్రాండ్ ఇమేజ్ ని రెట్టింపు చేసింది. కంగన ప్రతిభకు దక్కిన క్రెడిబిలిటీనే ఇదంతా. ఒక్క సినిమాతో ఆలియా బాలీవుడ్ నే షేక్ చేస్తోంది.
మహేష్ భట్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన అలియా ఇప్పుడు ప్రత్యేకమైన ఐడెంటిటీనే దక్కించుకుంది. మొదట గంగూబాయి పాత్రకి పనికొస్తుందా? అన్న సందేహించిన వారే! గంగూబాయి దిగొచ్చిందా? అని ప్రశంసించే విధంగా అలియా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇలా గంగూబాయి రూపంలో అలియాభట్ సక్సెస్ ని చిత్ర దర్శకుడు సంజయ్ లీలీ భన్సాలీ ముందే చూసేసారు. అందుకే ఏకంగా ఈ సినిమాకి అలియాభట్ కి 20 కోట్లు పారితోషికంగా చెల్లించారుట.
అదే నిజమైతే ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ గా అలియా భట్ నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లే. ఇప్పటివరకూ బాలీవుడ్ హీరోయిన్లకు 10 - 15 కోట్ల మధ్యనే చెల్లించారు. ఈ రేంజ్ పారితోషికం తీసుకునే భామలు దీపికా పదుకొణే..ప్రియాంక చోప్రా..కరీనా కపూర్ లాంటి కొంత మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్లనే అలియాభట్ తలదన్నిందని చెప్పొచ్చు. అయితే ఈ విషయంలో తెలిసిన కొంత మంది సీనియర్ హీరోయిన్లు.. అలియా సమకాలీకులు లోలోపలు కుళ్లుకుంటున్నారుట. అదీ అలియాభట్ సత్తా అలియాస్ గంగూబాయి!