Begin typing your search above and press return to search.
మాస్ 'లైగర్'తో అనన్య మెంటలెక్కిస్తుందా?
By: Tupaki Desk | 12 April 2022 4:30 AM GMTకెరీర్ ఆరంభమే పూరి జగన్నాథ్ లాంటి మాస్ కమర్షియల్ డైరెక్టర్ తో అవకాశం దక్కితే ఆ రేంజే వేరేగా ఉంటుంది. ఇలియానా .. హన్సిక.. నభా నటేష్.. ముమైత్ లాంటి ఓ నలుగురిని పరిశీలిస్తే చాలు .. అసలు విషయం అర్థమైపోతుంది. వీరంతా ఒక రేంజు స్టార్లు అయ్యారంటే అది పూరీ లాంటి డైరెక్టర్ తో పని చేయడం వల్లనే.
ఇప్పుడు అలాంటి అరుదైన అవకాశం అనన్య పాండేకి దక్కింది. బాలీవుడ్ లో అగ్ర దర్శకులతో పని చేసినా దక్కనిది ఇప్పుడు అనన్య పాండేకి దక్కనుంది. మాస్ క్వీన్ గా ఈ చిత్రంలో కుర్రకారు గుండెల్ని దోచేయనుంది ఈ బ్యూటీ. విజయ్ దేవరకొండ- అనన్య పాండే జంటగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లైగర్ ఆగస్టులో విడుదల కానుంది.
ఇంతకుముందు అనన్య పాండే - వీడీ మధ్య సన్నివేశాలకు సంబంధించిన లీకులు అందగానే అభిమానులు పరేషాన్ అయ్యారు. ఆ ఫోటోగ్రాఫ్స్ లో అనన్య టూ హాట్ గా కనిపించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు వీడియోలతో బోలెడంత హైప్ నెలకొంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.
తాజా సమాచారం మేరకు... అనన్య పాండే ఈ సినిమాకి డబ్బింగ్ ప్రారంభించింది. పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా పూర్తవుతోందని సమాచారం. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి-ఛార్మి నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అతడు విజయ్ దేవరకొండకు తండ్రి గా బాక్సింగ్ కోచ్ గా కనిపిస్తాడని కూడా గుసగుస వైరల్ అయ్యింది. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో లైగర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ పరంగా బోలెడంత హైప్ నెలకొంది.
గెహ్రయాన్ తో మరింత జోరు..!
లేటెస్ట్ బాలీవుడ్ మూవీ 'గెహ్రయాన్' తో బోలెడన్ని ప్రశంసలు పొందిన అనన్య పాండే మునుముందు బాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీ కానుంది. కుర్రబ్యూటీ అనన్య పాండే వేషధారణ ఇప్పుడు నిరంతరం బోయ్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. గెహ్రయాన్ విడుదలైంది మొదలు అగ్గి రాజేస్తోంది ఈ బ్యూటీ. బికినీ చిట్టి పొట్టి దుస్తుల్లో నిరంతర ట్రీట్ తో కట్టి పడేస్తోంది.
అనన్య స్టైలింగ్ పైనా ఇటీవల యూత్ వెర్రెత్తిపోవడం కనిపిస్తోంది. క్వార్టెట్ ట్రెండ్ సెట్టర్ లు జీన్స్ వంటి లేడ్ బ్యాక్ దుస్తుల నుండి వైబ్రెంట్ పార్టీ వేర్ .. ఆఫ్-డ్యూటీ బ్లేజర్ సెట్ల వరకు అనన్య అనుసరించని ఫ్యాషన్ లేనే లేదు. బికినీలు మోనోకినీలు వేరే లెవల్ అనడంలో సందేహం లేదు. అనన్య తదుపరి కరణ్ జోహార్ సహా పలువురు అగ్ర దర్శకుల సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉంది.