Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్: `భోళా శంకర్` ధూమ్మచాలే..!
By: Tupaki Desk | 1 March 2022 3:06 AM GMTమెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్- అనిల్ సుంకర కాంబినేషన్ లో రూపొందుతున్న మెగా భారీ చిత్రం `భోళా శంకర్` ఫస్ట్ లుక్ విడుదలైంది. మెగాస్టార్ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి అత్యంత భారీ బడ్జెట్ ని వెచ్చిస్తున్నారని సమాచారం. ఈ రోజు మహా శివరాత్రి శుభ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయగా వైరల్ గా దూసుకుపోతోంది.
వైబ్ ఆఫ్ భోలా అనే ఫస్ట్ లుక్ పోస్టర్ చిరంజీవిని స్టైలిష్ అండ్ బెస్ట్ అవతార్ లో ప్రెజెంట్ చేసింది. అతని డ్రెస్సింగ్ దగ్గర్నుంచి సిట్టింగ్ పొజిషన్ వరకు చేతిలోని చైన్ ని తిప్పే విధానం వరకు చూస్తుంటే చిరులోని మాసిజాన్ని మెహర్ ఒక రేంజులో ఆవిష్కరించబోతున్నాడని అర్థమవుతోంది. శివుని శక్తివంతమైన ఆయుధం అయిన త్రిశూలం చిరంజీవి చేతి వేళ్లపై అలా గిర్రున తిరుగుతుంటే ఫ్యాన్స్ గుండెలు గుబగుబా తిరిగేస్తున్నాయి. ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన గొలుసును హైలైట్ చేయడం విశేషం. చిరు అల్ట్రా స్టైలిష్ లుక్ నిజంగానే అభిమానులకు స్టన్నర్ అని చెప్పాలి.
స్పోర్టింగ్ షేడ్స్ లుక్ లో ఎంతో స్టైల్ ఎలివేట్ అయ్యింది. ఇక చిరంజీవి జీపు బంపర్‌పై కూర్చొని ఉన్న తీరు ఆసక్తికరం. ఇలా డిజైనర్ లుక్ లో ఆయనను చూడటం ఒక కన్నుల పండుగ. మెగాస్టార్ కి అంతటి ఎలివేషన్ ఇస్తూ బ్యాక్ గ్రౌండ్ లో జనం సంగీత వాయిద్యాలతో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ మెగా అభిమానులతో పాటు సినీ అభిమానుల్లోకి దూసుకెళుతోంది. మహతి స్వర సాగర్ అందించిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పోస్టర్ నేపథ్యాన్ని ఎలివేట్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటిస్తుండగా.. డాజ్లింగ్ బ్యూటీ తమన్నా ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ లో కథానాయికగా కనిపించనుంది, ఇందులో భావోద్వేగాలు డ్రామా ఇతర అంశాలు సరైన నిష్పత్తిలో ఉంటాయి.
క్రియేటివ్ కమర్షియల్స్ తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ కెమెరా వర్క్ అందిస్తున్నాడు. కథ పర్యవేక్షకుడిగా సత్యానంద్ కొనసాగగా... తిరుపతి మామిడాల సంభాషణలు అందించారు. దీనికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ .. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భోళా శంకర్ ని ఈ ఏడాది థియేటర్లలో విడుదల చేయనున్నారు.
రఘు బాబు- రావు రమేష్- మురళీ శర్మ- రవిశంకర్- వెన్నెల కిషోర్- తులసి- ప్రగతి- శ్రీ ముఖి- బిత్తిరి సత్తి- సత్య- గెటప్ శ్రీను- రష్మీ గౌతమ్- ఉత్తేజ్- ప్రభాస్ శీను తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- దర్శకత్వం: మెహర్ రమేష్..నిర్మాత: రామబ్రహ్మం సుంకర.