Begin typing your search above and press return to search.
తండ్రి లాంటోడు కాటేశాడని నటి ఆవేదన
By: Tupaki Desk | 7 April 2022 7:30 AM GMTబిగ్ బాస్ లో కనిపిస్తే చాలు ఆఫర్లే ఆఫర్లు అంటూ బోలెడంత ప్రచారం సాగుతోంది. కానీ అదే బిగ్ బాస్ కొందరికి పెను శాపంగానూ మారుతోంది. ఇదే విషయాన్ని అంగీకరించింది ఒక ప్రముఖ తెలుగునటి. సదరు అందాల భామ బిగ్ బాస్ లో నటించక ముందు బోలెడన్ని అవకాశాలు అందుకునేది. కానీ ఆ తర్వాత సీన్ మారింది. బిగ్ బాస్ లో విన్ అయ్యింది లేదు కానీ.. ఆ క్రేజ్ ఎందుకూ పనికి రాలేదని కూడా టీవీల ముందు గగ్గోలు పెట్టడం చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఓటీటీలోనూ పార్టిసిపేట్ చేసిన ఈ బ్యూటీకి ఇది కూడా నీరసం పుట్టించింది. షో నుంచి అర్థాంతరంగా తనని తొలగించారని ఆవేదన చెందింది. తండ్రి లాంటోడు కిందికి తొక్కుకుంటూ ముందుకు వెళ్లిపోవాలని చూశాడని.. అందుకే తనకు తుపాకీ ఇస్తే తనని లేపేస్తానని కూడా వ్యాఖ్యానించింది.
ఇకపోతే చాలా మంది ఔత్సాహిక నటీమణులు పరిస్థితి టాలీవుడ్ లో ఇలానే ఉంది. ముఖానికి రంగు వేసాక బోలెడంత కిక్కుంటుంది కానీ అవకాశాలు రాకపోతే మాత్రం ఆ రంగును తొలగించాలో లేదో కూడా అర్థం కాని సన్నివేశంలోకి జారుకుంటున్నారు.
అవకాశాల్లేక ఇంటికి వెళ్లలేక నానా తంటాలు పడుతున్నారు. కరోనా క్రైసిస్ లో అయితే కనీసం పర్సనల్ స్టాఫ్ కి జీతాలివ్వలేక వారిని ఇంటికి పంపలేక కూడా సతమతమయ్యారట. అదే క్రమంలో డీగ్రేడ్ సినిమాలకు కూడా అంగీకరించాల్సిన సన్నివేశం తలెత్తిందట.
ఇంతకుముందు ఒక ప్రముఖ హీరోయిన్ అయితే ముంబైలోని తన ఇంటి లోన్ కూడా కట్టలేకపోయానని పని లేకపోవడం వల్ల చిక్కులు ఎదుర్కొన్నానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడిప్పుడే కరోనా కల్లోలం తగ్గి ఇండస్ట్రీ నెమ్మదిగా కోలుకుంటోంది. పని పెరుగుతోంది. అందువల్ల మునుముందు ఇలాంటి భామలందరికీ అవకాశాలు మెరుగవుతాయనే ఆకాంక్షిద్దాం.