Begin typing your search above and press return to search.

గంగూభాయ్‌ పరిస్థితి ఏంటీ?

By:  Tupaki Desk   |   6 March 2022 2:30 AM GMT
గంగూభాయ్‌ పరిస్థితి ఏంటీ?
X
ఆలియా భట్ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన గంగూ భాయ్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ను విడుదల చేయడం జరిగింది. హిందీ తో పాటు పలు భాషల్లో కూడా విడుదల అయిన ఈ సినిమా కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. తెలుగు లో కూడా పాజిటివ్ వసూళ్లు నమోదు అవుతాయని అంతా భావించారు.

పవన్ భీమ్లా నాయక్ సినిమా ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గాయి. మొత్తంగా సినిమా మంచి వసూళ్లను దక్కించుకున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. లేడీ ఓరియంటెడ్‌ మూవీస్ ఒక మోస్తరు వసూళ్లు నమోదు చేయడం గొప్ప విషయం గా భావిస్తూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో ఈ సినిమ ఇప్పటి వరకు 70 కోట్ల వసూళ్లను రాబట్టింది. లాంగ్‌ రన్ లో ఈ సినిమా వంద కోట్ల మార్క్ ను అందుకోవడం ఖాయం అనిపిస్తుంది.

గతంలో కంగనా రనౌత్ నటించిన మణికర్ణికతో పోల్చితే ఈ సినిమా మరింత ఎక్కువ వసూళ్లు నమోదు చేస్తుంది అంటూ బాలీవుడ్‌ ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని కంగనా రనౌత్ మాత్రం ఆలియా భట్‌ సినిమా వసూళ్ల విషయంలో విమర్శలు చేస్తూ పరోక్షంగా సోషల్‌ మీడియా లో పోస్ట్‌ లు పెడుతూ గంగూ భాయ్ సినిమా ను అవమానిస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తోంది అంటూ టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా లో ఆలియా భట్‌ తో పాటు అజయ్‌ దేవగన్‌ కూడా నటించాడు. ఒక వేశ్య తన వర్గం వారి అభ్యున్నతి కోసం ఎలాంటి పని చేశారు. ఆమె చేసిన సంఘ సంస్కరణ లు ఏంటీ అనేది ఈసినిమా లో చూపించడం జరిగింది. సంజయ్ లీలా భన్సాలీ పేరు చెప్పగానే భారీ సినిమా లు గుర్తుకు వస్తాయి. ఈ సినిమా ఆయన స్థాయికి తగ్గట్లుగా ఉందంటూ రివ్యూలు మరియు ప్రేక్షకుల నుండి టాక్ వచ్చింది.

గంగూ భాయ్ సినిమా చిత్రీకరణ సమయంలో కరోనా వల్ల చాలా ఆలస్యం అయ్యింది. ఆలియా భట్ అభిమానులు ఈ సినిమా కోసం నెలల తరబడి ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి ముందుకు రావడంతో భారీగా వసూళ్ల కుమ్మరిస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వసూళ్ల విషయంలో కొందరు విమర్శలు చేస్తున్నా యూనిట్‌ సభ్యులు మాత్రం చాలా సంతృప్తిగా ఉన్నామని అంటున్నారు. సినిమా ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ అనే ప్రచారం కూడా జరుగుతోంది.