Begin typing your search above and press return to search.

గాలి వారసుడి డెబ్యూ మూవీతో సీనియర్ బ్యూటీ రీఎంట్రీ..!

By:  Tupaki Desk   |   5 March 2022 11:30 AM GMT
గాలి వారసుడి డెబ్యూ మూవీతో సీనియర్ బ్యూటీ రీఎంట్రీ..!
X
‘సత్యం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన క్యూట్ హీరోయిన్ జెనీలియా.. సౌత్ ఇండస్ట్రీలో కొన్నాళ్లపాటు స్టార్ గా వెలుగొందింది. అయితే మొదటి హీరో రితేష్ దేశ్‌ ముఖ్‌ ను 2013లో ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. తెలుగులో చివరగా 'నా ఇష్టం' చిత్రంలో నటించిన జెనీలియా.. పదేళ్ళ తర్వాత తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది.

క‌ర్ణాట‌క మాజీ మంత్రి, మైనింగ్‌ కింగ్‌ గాలి జ‌నార్ద‌న్ రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా లాంచ్ అవుతున్న చిత్రంలో జెనీలియా కీలక పాత్ర పోషిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌ లో ఘనంగా ప్రారంభమైంది.

డైరెక్టర్‌ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ముహుర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా కిరీటి లుక్‌ ను సంబంధించిన వీడియోను చిత్రం బృందం రిలీజ్ చేసింది. ఇందులో 'పెళ్లి సందD' ఫేమ్ శ్రీలీల హీరోయిన్‌ గా నటిస్తోంది.

తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీలో జెనిలియా ప్రాధాన్యత ఉన్న రోల్ లో కనిపించనుంది. సీనియర్ హీరోయిన్ తిరిగి సినిమాల్లో నటిస్తుండటంతో ఆమె ఫ్యాన్స్‌ అంతా ఖుషి అవుతున్నారు.

'బొమ్మరిల్లు' సినిమాలో హాసినిగా అందరికీ గుర్తుండి పోయిన జెనిలియా.. 'సాంబ' 'సై' 'ఢీ' 'రెడీ' 'ఆరెంజ్' వంటి చిత్రాల్లో మెప్పించింది. వెంకటేష్ - జూ.ఎన్టీఆర్‌ - రామ్‌ చరణ్‌ - రామ్ - రానా - నితిన్ - మంచు విష్ణు వంటి హీరోల సరసన జెన్నీ హీరోయిన్ గా నటించింది. తెలుగుతో పాటుగా హిందీ తమిళ చిత్రాల్లోనూ అలరించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రితేష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది.

అప్పటి నుంచి తన ఇద్దరు కుమారుల ఆలనాపాలనా చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి కానీ.. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇన్నాళ్లకు గాలి జనార్ధన్ తనయుడి తెరంగేట్రం మూవీతో వెండితెరపైకి రాబోతోంది. మరి జెనీలియా ఈ బైలింగ్విల్ తో సక్సెస్ అందుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతుందేమో చూడాలి.