Begin typing your search above and press return to search.
నక్కినక్కి కాదే తొక్కుకుంటూ పోవాలే అంటే ఎన్టీఆర్‌నే తొక్కేస్తారా?
By: Tupaki Desk | 30 March 2022 1:30 AM GMTభారతీయ సినీ ప్రియులు దాదాపు మూడున్నరేళ్ల పాటు ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ట్రిపుల్ ఆర్. ఈ మూవీ ఎప్పుడెప్పడు థియేటర్లలోకి వస్తుందా? ఎప్పుడెప్పుడు చూసేయాలా? అని కోట్లాది మంది వేయి కళ్లతో ఎదురుచూశారు. అయితే గత కొంత కాలంగా కరోనా, ఒమిక్రాన్ ప్రకంపణల కారణంగా రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న శుక్రవారం భారీ స్థాయిలో ఏ తెలుగు సినిమా విడుదల కానీ విధింగా అత్యధిక స్క్రీన్ లలో విడుదలైంది.
తొలి షో నుంచే పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ అనే టాక్ మొదలైంది. దానితో పాటు సినిమాపై విమర్శలు కూడా మొదలయ్యాయి. రాజమౌళి రూపొందించిన 'మగధీర'రిలీజ్ అయిన సమయంలో ఈ మూవీని చండేరి నవలని లేపేసి తీశారంటూ విమర్శలు ఎదురయ్యాయి. ఆ తరువాత 'బాహుబలి' సమయంలోనూ హాలీవుడ్ చిత్రాల సీన్ లని తీసుకుని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చుకుని సినిమా చేశారంటూ విమర్శలు వినిపించాయి.
ట్రిపుల్ ఆర్ విషయంలో అలాంటి విమర్శలు వినిపించలేదు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మాత్రం తొక్కేశారంటూ కామెంట్ లు స్టార్టయ్యాయి. సినిమాలో ఇద్దరి పాత్రలకు సమాన ప్రాధాన్యత వుందంటూ మొదటి నుంచీ చెప్పుకుంటూ వచ్చి రాజమౌళి సినిమాలో మాత్రం నిజంగా ఎన్టీఆర్ ని తొక్కేశాడని అంటున్నారు. నక్కి నక్కి కాదే తొక్కుకుంటూ పోవాలే.. అంటూ ఎన్టీఆర్ చేత ఓ డైలాగ్ ని చెప్పించారు రాజమౌళి. కానీ నక్కినక్కి కాదే తొక్కుకుంటూ పోవాలే అంటే ఎన్టీఆర్‌నే తొక్కేస్తారా? అంటున్నారు ఆయన అభిమానులు.
సినిమాలో చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ని బట్టే ఎన్టీఆర్ కు సినిమాలో జక్కన్న ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో స్పష్టమైపోయింది. పదివేల మంది దొమ్మీగా కొట్టుకుంటుంటే బ్రిటీస్ పోలీస్ అధికారికగా ఆ గుంపలో పడి మందను చెదరగొడుతున్నట్టుగా చరణ్ ఇంట్రడక్షన్ ని చూపించిన తీరు ఓ రేంజ్ లో వుంది. ఎన్టీఆర్ తో పులి ఫైట్ సీన్ ని చూపించి తనకి అడవి బిడ్డగా ఎలివేషన్ ఇచ్చానని అనుకున్నాడు జక్కన్న కానీ అది చరణ్ ఎలివేషన్ ముందు తేలిపోయింది. మాస్ పల్స్ తెలిసిన జక్కన్నకు అది తెలియనిది కాదు. కానీ అదే చేశాడు. ఎన్టీఆర్ ని తక్కువ చేసి చూపించాడు అంటున్నారు ఫ్యాన్స్.
ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లోనూ ఎన్టీఆర్ ని ఓ రేంజ్ లో లేపుతున్నాడని అనుకుని ఫ్యాన్స్ రొమ్మువిరిచేలోపు చరణ్ ఎంట్రీతో నడ్డివిరిచేశాడు. ఒకటి కాదు రెండు కాదు ముందు నుంచయే ఎన్టీఆర్ ని సెకండ్ హీరోకి తక్కువగా చేసి చూపిస్తూ చరణ్ ని లేపుతూ వచ్చాడని, సెకండ్ హాఫ్ లో.. క్లైమాక్స్ సన్నివేశాల్లోనూ ఎన్టీఆర్ ని చరణ్ కు ఓ విధంగా హెంచ్ మెన్ ని చేశావేంటి జక్కన్నా అని ఫ్యాన్స్ ఇప్పడు నిలదీస్తున్నారు. చరణ్ కి చైల్డ్ హుడ్ ఎపిసోడ్.. ఎన్టీఆర్ కు .. మరీ ఇంత దారుణమా?.. ఓ ఫ్యామిలీ లేదు.. ఓ పర్పస్ లేదు.. నిజాంని గడగడలాండించిన వ్యక్తి కొమురం భీం.. ఈ పాత్రని మరీ అమాయకుడిలా పోట్రేట్ చేయడమేంటీ? జక్కన్న అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఇక ట్రిపుల్ ఆర్ తీసింది ఇద్దరి కోసం కాదా? ఒక్కరిని లేపి మరొకరిని తొక్కేయడం కోసమేనా? ఇద్దరూ సమానమే కానీ ఎక్కడా కానరాదే.. మాటల్లో సమానం చేతల్లో... కనిపించలేదే.. భీం పాత్రని పోట్రేట్ చేసిన తీరు ఓ వర్గాన్ని కించపరిచేలానే వుంది.. టాలీవుడ్ లో వున్న టాప్ హీరోల్లో ఎన్టీఆర్ నటన, డైలాగ్ డెలివరీ... ఫెరోషియస్ పాత్రల్లో అతని ఆహార్యం ఎవరికీ తెలియనిది కాదు. ఎన్టీఆర్ ని బెబ్బులిలా చూపించే అవకాశం వుండి కూడా చరణ్ చాటు నటుడిగా నిలబెట్టావే? ఇదే నా స్నేహానికి మీరిచ్చిన వాల్యూ..తొక్కుకుంటూ పో సత్తా వున్న ఎన్టీఆర్ నే ఇలా తొక్కేస్తే ఎలా జక్కన్నా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారట ఎన్టీఆర్ ఫ్యాన్స్.