Begin typing your search above and press return to search.

'ఫేస్' కి హ‌బ్బీతో ఫోజులిచ్చిన చంద‌మామ‌

By:  Tupaki Desk   |   1 March 2022 6:29 AM GMT
ఫేస్ కి హ‌బ్బీతో ఫోజులిచ్చిన చంద‌మామ‌
X
కాజ‌ల్ అగ‌ర్వాల్- గౌత‌మ్ కిచ్లూ ధాంప‌త్య జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఇన్ స్టా వేదిక‌గా ఆలు మ‌గ‌ల‌ ప్రేమ ఎప్పుడూ వైర‌ల్ అవుతుంటుంది. ప్ర‌స్తుతం కాజల్ నిండు గ‌ర్భిణి. మ‌రికొన్ని నెల‌ల్లో ఓ పాపాయి కి జ‌న్మ‌నివ్వ‌బోతుంది. మాతృమూర్తిగా అమ్మా అనే పిలుపును అందుకోబోతుంది. ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటూ కుటుంబంతోనే స‌మ‌యాన్ని గ‌డుపుతోంది.

భ‌ర్త గౌత‌మ్ ని క్ష‌ణం కూడా మిస్ అవ్వ‌డం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ధాంప‌త్య జీవితాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తోంది. అయితే ఇక్క‌డ ఇద్ద‌రు వేర్వేరు రంగాల నుంచి వ‌చ్చిన వారు. ఇద్ద‌ర్ని ఒక‌టి చేసింది కేవ‌లం ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ మాత్ర‌మే.

కాజ‌ల్ పెద్ద హీరోయిన్. గౌత‌మ్ మాత్రం సినిమా రంగానికి సంబంధం లేని వ్య‌క్తి. అత‌ను బిజినెమెన్. త‌న రంగంలో ఎంతో బిజీగా ఉంటాడు. పెళ్లికి ముందు వ్యాపారాలంటూ విదేశాల్లోనే ఎక్కువ‌గా ఉండేవారు. పెళ్లి త‌ర్వాత‌నే ముంబైలో స్థిర‌ప‌డ్డారు. ఇప్పుడు ముంబైని విడిచిపెట్ట‌డం లేదు. అందులోనూ చంద‌మామ‌ని కంటికి రెప్ప‌లా ఇంట్లో ఉండే చూసుకుంటున్నారు. కాజ‌ల్ గ‌ర్బం దాల్చిన ద‌గ్గ‌ర నుంచి గౌత‌మ్ పని కాజ‌ల్ సేవ‌యే. ఇలా బిజినెస్ అంటూ తిరిగే గౌత‌మ్ ని సైతం కాజ‌ల్ సెల‌బ్రిటీని చేసేసింది.

ఇద్ద‌రు జంట‌గా `ఫేస్` మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీకి ఫోజులిచ్చారు. ఆ మ్యాజ‌గైన్ క‌వ‌ర్ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గామారింది. కాజ‌ల్ ఎరుపు రంగు సారీ..షోల్డ‌ర్ లెస్ మ్యాచింగ్ బ్లౌజ్ ధ‌రించింది. గౌత‌మ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేష్ దుస్తులు ధ‌రించారు. కాజ‌ల్ -హ‌బ్బీ గుండెల‌పై చేతులు వేయ‌గా..గౌత‌మ్ భార్య న‌డుము పై చేయి వేసి క్యూట్ స్మైల్ తో కెమారాకి ఫోజులిచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. భార్య‌భ‌ర్త‌ల్ని ఇలా చూసి అభిమానులు మురిసిపోతున్నారు. క్యూట్ ఫెయిర్...జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక కాజ‌ల్ సినిమాల విష‌యానికి వ‌స్తే త‌మిళ్..తెలుగు..హిందీ అంటూ మూడు భాష‌ల్ని దున్నేస్తోంది. కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తోంది. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్త‌య్యాయి.

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న `ఆచార్య‌` న‌టిస్తోంది. చిరంజీవితో క‌లిసి న‌టించ‌డం ఇది రెండ‌వ సారి. గ‌తంలో `ఖైదీ నెంబ‌ర్ 150` లో మెగాస్టార్ కి జోడీగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అదే సెంటిమెంట్ తో కొర‌టాల శివ మ‌రోసారి కాజల్ ని చిరు స‌ర‌స‌న రిపీట్ చేసారు. `ఇండియ‌న్ -2` లో విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న స‌ర‌స‌న న‌టిస్తోంది.