Begin typing your search above and press return to search.

ఆ అరవ మూవీతో మనోడికి ఏమైనా ప్రయోజనం దక్కిందా?

By:  Tupaki Desk   |   1 March 2022 4:53 AM GMT
ఆ అరవ మూవీతో మనోడికి ఏమైనా ప్రయోజనం దక్కిందా?
X
తమిళ స్టార్‌ హీరో అజిత్ నటించిన వాలిమై సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంద కోట్ల వసూళ్లను క్రాస్ చేసిన ఈ సినిమా లో విలన్ పాత్రలో తెలుగు యంగ్‌ హీరో కార్తికేయ నటించిన విషయం తెల్సిందే. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయినా కూడా వసూళ్లు అయితే భారీగా రాబడుతోంది. కాని ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వాలిమై సినిమా ఒక మోస్తరు సినిమానే అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు తేల్చేస్తున్నారు.

తెలుగు లో ఈ సినిమా పెద్దగా సందడి చేయలేక పోయింది. వాలిమై విడుదల అయిన రెండవ రోజే భీమ్లా నాయక్ విడుదల అయ్యింది. దాంతో జనాలు వాలిమై గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు అంటూ వస్తున్న వసూళ్లను బట్టి అర్థం అవుతోంది. వాలిమై సినిమా లో కార్తికేయ నటించడం వల్ల తెలుగులో మంచి బజ్ అయితే క్రియేట్‌ చేయగలిగారు కాని అది వసూళ్ల రూపంలో మారలేదు.

వాలిమై సినిమాను చూస్తుంటే ఓ హాలీవుడ్‌ మూవీ చూస్తున్న ఫీలింగ్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో వాలిమై సినిమా కు సంబంధించిన తమిళ టాక్ ని చూస్తే హీరో అజిత్‌ తో పాటు విలన్ గా నటించిన కార్తికేయ గురించి చర్చించుకుంటున్నారు. కార్తికేయ కోరుకోవాలే కాని.. ఓకే అనాలే కాని అక్కడ బ్యాక్ టు బ్యాక్‌ భారీగా పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు కార్తికేయ కు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

హీరోగా తెలుగు లో ఆర్‌ ఎక్స్ 100 సినిమా తర్వాత అంతటి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాడు. అయినా కూడా ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇటీవలే కూడా హీరోగా ఒక సినిమా ను చేసినా అది కూడా నిరాశ పర్చింది. హీరోగా మరో రెండు సినిమాలు కూడా ఈ యంగ్‌ హీరో చేస్తున్నాడు. విలన్ గా చేసిన రెండు పాత్రలు కూడా అతడి క్రేజ్ ను పెంచాయి అనడంలో సందేహం లేదు.

వాలిమై సినిమా కార్తికేయ కు తమిళనాట మంచి ఇమేజ్ ను బిల్డ్‌ చేసింది అనడంలో సందేహం లేదు. అయితే అక్కడ విలన్ గా కంటిన్యూ అవ్వడం కంటే ఆ ఇమేజ్ తో మెల్ల మెల్లగా హీరోగా అక్కడ కూడా సినిమాల్లో నటిస్తే బాగుంటుందనే అభిప్రాయం ను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

కార్తికేయ తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు వస్తే తోసి పుచ్చకుండా కమిట్‌ అయితే ఆయన కెరీర్‌ కు ఒక మంచి టర్నింగ్‌ పాయింట్‌ దక్కే అవకాశాలు లేకపోలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.