Begin typing your search above and press return to search.

శ్రీవారి ఆశీస్సుల‌తో 'విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ'

By:  Tupaki Desk   |   14 March 2022 5:13 AM GMT
శ్రీవారి ఆశీస్సుల‌తో  విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ
X
`ఎస్. ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం` చిత్రంతో యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం కి మంచి గుర్తింపు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. కోవిడ్ కాలంలో రిలీజ్ అయిన రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామా పాజిటివ్ టాక్ తో బాగానే ఆడింది. థియేట‌ర్లు పూర్తిగా తెర‌వ‌ని రోజుల్లో రిలీజ్ అయి స‌క్సెస్ అందుకోవ‌డం తో కిర‌ణ్ కి మంచి పేరొచ్చింది. వ‌సూళ్ల ప‌రంగా కొంత ప్ర‌భావం ప‌డిన‌ప్ప‌టికీ పూర్తి స్థాయిలో థియేట‌ర్లు అందుబాటులో ఉంటే మంచి వ‌సూళ్లు సాధించేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేసాయి. ఆ సినిమాతో ప్రామిసింగ్ హీరోగా కిర‌ణ్ కి మంచి పేరొచ్చింది. దీంతో యంగ్ హీరోకి బ్యాక్ టూ బ్యాక్ అవ‌కాశాలు ఇంటి త‌లుపుత‌ట్టాయి.

మెగా బ్యాన‌ర్ గీతా ఆర్స్ట్ అనుబంధ సంస్థ జీఏ-2లో సైతం కిర‌ణ్ అవ‌కాశం అందుకున్న సంగ‌తి తెలిసిందే.`విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ` అనే టైటిల్ తో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. జ‌న‌వ‌రిలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం జ‌రుపుకుంది. అయితే థ‌ర్డ్ వేవ్ నేప‌థ్యంలో..ఇత‌ర బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఇన్నాళ్లు రెగ్యుల‌ర్ షూటింగ్ ఆల‌స్య‌మైంది.

తాజాగా ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ సోమ‌వారం తిరుప‌తిలో మొద‌లైంది. ఇది భారీ షెడ్యూల్. దాదాపు 35 రోజుల పాటు ఏక‌ధాటిగా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్ ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటుంది. ఈ షెడ్యూల్ అనంత‌రం హైద‌రాబాద్ స‌హా ఇత‌ర ప్రాంతాల్లో త‌దుప‌రి షెడ్యూల్స్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

అయితే కీల‌క స‌న్నివేశాలు దాదాపు మొద‌టి షెడ్యూల్ ల్లోనే పూర్తిచేసే అవ‌కాశం ఉంది. అయితే స‌మ్మ‌ర్ నేప‌థ్యంలో ఎండ‌లు ముదిరేలోపే షూటింగ్ పూర్తిచేసే అవ‌కాశం ఉంది. ఇందులో కిర‌ణ్ కి జోడీగా క‌శ్మీరా న‌టిస్తోంది. కంటెట్ బేస్డ్ చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి నంద కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

కొత్త ప్ర‌తిభ‌ని ప్రోత్స‌హించ‌డంలో జీఏ2 ఎప్పుడూ ముందుటుందని మ‌రోసారి ఈ కాంబినేష‌న్ తో రుజువు చేస్తుంది. మెగా బ్యాన‌ర్ లో సినిమా నిర్మాణం కావ‌డంతో మంచి బ‌జ్ క్రియేట్ అవుతోంది. జీఏ-2 గ‌తంలో అందుకున్న స‌క్సెస్ ల నేప‌థ్యంలో ఈ సినిమాపై టీమ్ అంతా కాన్ఫిడెంట్ గా ఉంది.

ఇక యువ ప్ర‌తిభాశాలి కిర‌ణ్ యువ‌తలో క్రేజీ స్టార్ గా మారుతున్నాడు. అవ‌న్నీ సినిమాకి క‌లిసొచ్చే అంశాలు. ఇంకా కిర‌ణ్ `స‌మ్మ‌త‌మే`..`నేను మీకు బాగా కాల‌వాల్సిన వాడిని` వంటి మ‌రో రెండు సినిమాలు కూడా ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇలా ఒకేసారి ఏకంగా మూడు సినిమాల్లో న‌టిస్తూ అన‌తి కాలంలోనే బిజీ స్టార్ గా మారాడు.