Begin typing your search above and press return to search.

స‌ర్కారు వారు ఇలా సిగ్గరి అయితే ఎలా?

By:  Tupaki Desk   |   12 April 2022 11:30 AM GMT
స‌ర్కారు వారు ఇలా సిగ్గరి అయితే ఎలా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో 'స‌ర్కారు వారి పాట' తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సర్కారు వారు సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. మ‌హేష్ లుక్...కీర్తి సురేష్ అల్ల‌రి ప‌నుల ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. అటు క‌ళావ‌తి పాట‌తో శ్రోత‌ల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. మ‌హేష్ హుక్ స్టెప్ అన్ని వేడుక‌ల్లో దిగిపోతుంది. యూ ట్యూ బ్ లో పాట రికార్డుల‌నే న‌మోదు చేస్తోంది.

తాజాగా సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వ‌చ్చేసింది. ఒక పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యింద‌ని యూనిట్ తెలిపింది. అటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది.

'గెట్ రెడీ ఫ‌ర్ ఎగ్జైటింగ్ అప్ డేట్స్' అంటూ ఫ్యాన్స్ లో ఉర‌క‌లేసే ఉత్సాహం నింపుతున్నారు. 'ఎస్ వీపీ' మేనియా బిగిన్స్ అంటూ సినిమాకి బ‌జ్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు షురూ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని మే 12న రిలీజ్ చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

బ్యాలెన్స్ సాంగ్ ని కూడా వీలైనంత త్వ‌రగా షూట్ పూర్తిచేసే అవ‌కాశం క‌నిపిస్తుంది. మ‌రోవైపు ప్ర‌చారం ప‌నులు షూరు చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో యూనిట్ మ‌హేష్ కొత్త లుక‌ల్ ని కొద్ది సేప‌టి క్రిత‌మే రిలీజ్ చేసారు.

ఇందులో మ‌హేష్ సిగ్గ‌రిగా క‌నిపిస్తున్నాడు. రెండు చేతులు ముఖంపై పెట్టుకుని నెమెరుతున్న‌ట్లు ..క్యూట్ స్మైల్ తో ఆక‌ట్టుకుంటున్నారు. చేతికి బ్రాండెడ్ వాచ్... టీష‌ర్ట్ ధ‌రించాడు. బ్యాక్ గ్రౌండ్ లో ఎత్తైన బిల్డింగ్ లు పోస్ట‌ర్ లో హైలైట్ అవుతున్నాయి.

ఇలా పోస్ట‌ర్ తో మొద‌లైన ట్రీట్ ఇక‌పై కంటున్యూ కానుంది. ట్రైల‌ర్...గ్లింప్స్ ...సింగిల్స్ ఇలా ఒక్కొక్క‌టిగా మ‌హేష్ అభిమానులుకు బిగ్ ట్రీట్ ఇవ్వ‌నున్నాయి. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్- మైత్రీ మూవీ మేక‌ర్స్- జీఎంబీ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.