Begin typing your search above and press return to search.
హరి హరుని హంగామా .. ఎక్కడా ఆగదుగా?
By: Tupaki Desk | 8 April 2022 11:30 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పీడు పెంచారు. దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత రీమేక్ మూవీ 'వకీల్ సాబ్'తో మళ్లీ శుభారాంభాన్ని అందించిన పవన్ కల్యాణ్ అదే ఊపుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేస్తున్నారు. ఇటీవల మరో మలయాళ హిట్ చిత్రం ఆధారంగా రూపొందిన రీమేక్ 'భీమ్లానాయక్' తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. అయితే ఈ చిత్రాలకు ముందే మొదలైన పీరియాడికల్ మూవీ 'హరి హర వీరమల్లు'.
టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మూవీ కరోనా మహమ్మారి ప్రబలడానికి ముందే మొదలైంది. 15 రోజుల షూటింగ్ తరువాత కోవిడ్ కారణంగా ఆగిపోయింది. ఇది పవన్ కల్యాణ్ నటిస్తున్న 27వ సినిమాగా మొదలైంది. ఇటీవల వరుసగా భారీ చిత్రాల షూటింగ్ లు ప్రారంభమైన నేపథ్యంలో పవన్ పై కీలక ఘట్టాలని చిత్రీకరించారు. దీంతో దాదాపుగా 30 శాతానికి పైగానే చిత్రీకరణ పూర్తయిందే వార్తలు వినిపించాయి.
అయితే ఆ తరువాత వరుస రీమేక్ చిత్రాలకు పవన్ తన సమయాన్ని కేటాయించడంతో ఈ మూవీ షూటింగ్ రెగ్యులర్ గా వాయిదా పడుతూ వస్తోంది. ఓ పక్క రాజకీయాల్లో బిజీగా వుంటూనే మరో పక్క సినిమాలకు సమయం కేటాయిస్తుండటంతో 'హరి హర వీరమల్లు'కు పవన్ సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆసల్యమవుతూ వస్తోంది. తాజాగా పవన్ మరో రీమేక్ సినిమాపై కన్నేశారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో 'హరి హర వీరమల్లు' మరింత ఆలస్యకమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని వార్తలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో ఐదు నెలల పాటు ఈ మూవీకే పవన్ డేట్స్ కేటాయించారని ఓ ఆసక్తికరమైన వార్తలు బయటికి వచ్చింది. ఆ వెంటనే పవన్ ప్రత్యేకంగా ఈటెని విసురుతూ యాక్షన్ ఘట్టాల కోసం పవన్ సిద్ధమవుతూ రిహార్సల్స్ చేస్తున్న ఫొటోలు బయటికి రావడంతో ఎట్టకేలకు 'హరి హర వీరమల్లు' మళ్లీ పట్టాలెక్కుతోందని స్పష్టమైంది. గురువారం అన్నట్టుగానే ఈ చిత్ర షూటింగ్ ని ప్రారంభించారు. సెట్ లో వీరమల్లు గెటప్ లో పవన్ దర్శనమిచ్చారు.
అంతే కాకుండా పద్మశ్రీ తోట తరణి ప్రత్యేకంగా తన నిర్దేశకత్వంలో రూపొందించన భారీ సెట్ లలో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచూసిన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో పద్మశ్రీ తోట తరణిని ప్రత్యేకంగా హీరో పవన్ కల్యాణ్ పుష్ప గుచ్చాన్ని అందించి ఆత్మీయంగా సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.
గురువారం గ్రీన్ మ్యాట్ లో గ్రాఫిక్స్ కి సంబంధించిన కీలక ఘట్టాల చిత్రీకరణ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీకి మళ్లీ ఎక్కడా బ్రేక్ పడకూడదని, సాఫీగా పూర్తి కావాలని కోరుకుంటున్నారట. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా జ్ఞానశేఖర్ , కె.ఎల్ . ప్రవీణ్ ఎడిటింగ్ అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ని కీలక పాత్రల్లో నర్గీస్ ఫిక్రీ, అర్జున్ రాంపాల్, ఆదిత్యమ మీనన్, శుభలేఖ సుధాకర్, పూజితా పొన్నాడ నటిస్తున్నారు.