Begin typing your search above and press return to search.
పవర్ స్టార్ స్టామినాకి హార్స్ పవర్ కి రీచ్ అలా వుంటుంది
By: Tupaki Desk | 8 March 2022 6:31 AM GMTకొన్ని సినిమాలు కథ, కథనాలు బాగుంటే ఆడతాయి. కొన్ని సినిమాలు సీజన్ ని బట్టి ఎలా వున్నా ఆడతాయి కానీ స్టార్ హీరో సినిమాలు స్టార్ డమ్ ని బట్టి ఆడతాయి. కథలో దమ్మున్నా లేకున్నా తెర పై నచ్చిన స్టార్ కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఎగబడి ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టేస్తుంటారు. అలాంటి స్టార్లు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే వున్నారు. అందులో ముందు వరుసలో నిలబడే హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. కథ, కథనాలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సందర్భాలున్నాయి. ఫ్యాన్స్ లో ఆయనకున్న ఫాలోయింగ్ చేస్తూ ఎవరికైనా పిచ్చెక్కిపోద్ది.
అంతలా మాస్ ఫాలోయింగ్ వున్న ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ . టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించిన రీతిలో సంచలనాలు సృష్టించాయి. ఇది ట్రేడ్ పండితుల మాట. పవన్ వుంటే చాలు అది ఎలాంటి సినిమా అయినా.. రెగ్యులర్ ఫార్మాట్ కి భిన్నంగా చేసిన సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాల్సిందే. ఇదే విషయం ఇప్పుడు 'భీమ్లానాయక్' విషయంలోనూ మరో సారి రుజువైంది. పవర్ స్టార్ స్టామినా ఏంటో మరో సారి స్పష్టంగా తెలియజేసింది..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ 'భీమ్లానాయక్'. ఇటీవల విడుదలై ఈ చిత్రం దాదాపు రు. 100 కోట్ల మార్కుని టచ్ చేసింది. అయినా ఇది యావరేజ్ హిట్ అని క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. ఇటీవల విడుదలైన చిత్రాల వసూళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఏపీ టికెట్ జీవో విధానం వల్ల ఏపీ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చే అవకాశం వుందని స్పష్టం చేస్తున్నారు.
ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. 'భీమ్లానాయక్' ఓ రీమేక్ ఫిల్మ్. మలయాళ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. దానికి పవర్ స్టార్ ఇమేజ్ ని జోడించి మార్పులు చేర్పులు చేశారు. అంతే కాకుండా ఇటీవల వచ్చిన మాస్ యాక్షన్ చిత్రాల ఫార్మాట్ కి పూర్తి భిన్నంగా ఎలాంటి ఐటప్ సాంగ్‌లు, ప్రత్యేక గీతాలు. డ్యూయెట్ లు వంటి వగైరా లేకుండా కొత్త ఫార్మాట్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ గా ఈ మూవీని నిర్మించారు. గ్లమార్ డోస్ తో పాటు ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ మూవీలో లేవు. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా మాత్రమే ఈ మూవీని రూపొందించారు.
ఇటీవల మాస్ మసాలా యాక్షన్ అంశాల నేపథ్యంలో రూపొందిన అఖండ, పుష్ప ఏపీ టికెట్ రేట్ ల విధానం వసూళ్లకు భారీ అడ్డంకిగా మారినా ఈ చిత్రాలు మంచి వసూళ్లని రాబట్టాయి. అయితే ఈ రెండు చిత్రాల్లో వున్న ఆల్ ఎలిమెంట్స్ 'భీమ్లానాయక్'లో లేవు. అఖండ, పుష్ప చిత్రాల్లో భారీ యాక్షన్ ఘట్టాలున్నాయి. హై ఇంటెన్స్ తో సాగే హైవోల్టేజ్ యాక్షన్ ఘట్టాలున్నాయి. కానీ అలాంటి వి కూడా 'భీమ్లానాయక్'లో లేవు. అయినా సరే ఈ మూవీ రెండు వారాల్లో 100 కోట్ల మైలు రాయిని టచ్ చేసింది కారణం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టార్ డమ్.
తనకున్న క్రేజ్ మాత్రమే 'భీమ్లానాయక్' ఈ ఫీట్ ని చేయగలిగేలా చేసింది. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రాన్ని అమెజాన్ప్రైమ్ లో ఇప్పటికే చాలా మంది చూసి వున్నారు. అయినా సరే 'భీమ్లానాయక్' ఆ మాత్రం బాక్సాఫీస్ వద్ద రాబట్టగలిగిందంటే దానికి ప్రధాన కారణం పవర్ స్టార్ మాత్రమే. ఆయన చరిష్మానే భీమ్లా ఈ స్థాయిలో వసూళ్లని రాబట్టేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే విషయాన్ని ట్రేడ్ వర్గాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి.
ఈ మూవీ రీమేక్ కావడంతో రిలీజ్ కి ముందు ఇది 50 కోట్ల షేర్ ని మాత్రమే రాబడుతుందని కొంత మంది ట్రేడ్ పండితులు భావించారు. కానీ ఈ మూవీ ప్రీ రిలీజ్, థియేట్రికల్ బిజినెస్‌తో కలిపి నిర్మాతకు 108 కోట్ల మేర అందించడం విశేషం అని ఇది కేవలం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టార్ డమ్ వల్లే సాధ్యమైందని, పవర్ స్టార్ స్టామినాకి హార్స్ పవర్ కి రీచ్ అలా వుంటుంది ట్రేడ్ వర్గాలు ముక్తకంఠంతో చెబుతుండటం విశేషం.