Begin typing your search above and press return to search.

ఇప్పటికైనా మనోళ్లు ఈ అమ్మడిని గుర్తిస్తారా?

By:  Tupaki Desk   |   8 March 2022 12:30 AM GMT
ఇప్పటికైనా మనోళ్లు ఈ అమ్మడిని గుర్తిస్తారా?
X
చెన్నై ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్‌ మోహన్ ప్రస్తుతం కోలీవుడ్‌ లో మంచి జోష్‌ తో దూసుకు పోతుంది. తెలుగు లో ఈమె నాని గ్యాంగ్ లీడర్ మరియు శ్రీకారం సినిమాల్లో నటించింది. రెండు కూడా ఫీల్‌ గుడ్‌ మూవీస్ గా పేరు దక్కించుకున్నాయి. నాని గ్యాంగ్‌ లీడర్‌ కమర్షియల్‌ గా మంచి పేరును దక్కించుకోగా శ్రీకారం సినిమా మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. రెండు సినిమాల్లో కూడా చాలా క్యూట్‌ లుక్ లో ఈమె కనిపించింది.

హీరోయిన్ గా ప్రియాంక అరుల్‌ మోహన్ కు శ్రీకారం తర్వాత తెలుగు లో ఇప్పటి వరకు అవకాశాలు రాలేదు. తెలుగు లో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చినా కూడా ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం ఈమెను హీరోయిన్ గా తమ సినిమాల్లో ముఖ్యంగా స్టార్‌ హీరోలు తమ సినిమా ల్లో నటింపజేసేందుకు ఆసక్తి చూపడం లేదు. తెలుగు లో అవకాశాలు రానప్పటికి తమిళంలో మాత్రం ఈమెకు మంచి ఆఫర్లు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి.

తాజాగా ఈమె తమిళ స్టార్‌ హీరో సూర్య తో కలిసి 'ఈటీ' సినిమా లో నటించింది. సూర్య అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ టీ సినిమా లో ప్రియాంక అరుల్ మోహన్ లుక్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా అత్యంత అందంగా.. క్యూట్‌ గా సూర్య కు జోడీగా కనిపిస్తుంది అంటూ జనాలు పోస్టర్ లను చూసే అనేస్తున్నారు.

మార్చి 10వ తారీకున తమిళం మరియు తెలుగు లో ఒకే సారి విడుదల కాబోతున్న ఈటీ సినిమా తో ప్రియాంక ఖచ్చితంగా స్టార్‌ డమ్‌ ను దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. సూర్య కు జోడీగా నటించడం వల్ల తెలుగు లో కూడా ఈమె మరింత గా టాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువ అయ్యే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రియాంక అరుల్‌ మోహన్ తెలుగు లో ఈటీ ద్వారా మరోసారి రాబోతున్న నేపథ్యంలో ఈసారి అయినా మనోళ్లు ఆమె అందంను మరియు ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తారేమో చూడాలి. అందాల ఆరబోత విషయంలో కాస్త దూరం ఉండే ప్రియాంక అరుల్‌ మోహన్‌ ను తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ దూరం పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

తెలుగు ఫిల్మ్‌ మేకర్స్‌ కు హాట్‌ గా అందాలు ఆరబోసే వారే కావాలా ప్రియాంక అరుల్‌ మోహన్ వంటి క్యూట్‌ లుక్‌ ముద్దుగుమ్మలు వద్దా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.