Begin typing your search above and press return to search.
'ప్రాజెక్ట్-k' కోసం రంగంలోకి దిగేసిన మహీంద్ర టెక్నాలజీ!
By: Tupaki Desk | 14 March 2022 7:32 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `మహానటి` ఫేం నాగ్ అశ్విన్ `ప్రాజెక్ట్ -కె`ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 400 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సదరు సంస్థలో ఇదే తొలి భారీ బడ్జెట్ చిత్రం సహా టాలీవుడ్ నుంచి అగ్రగామి సంస్థగా ఖ్యాతికెక్కబోతుంది. `బాహుబలి`..`ఆర్ఆర్ ఆర్` లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు పోటీగా `ప్రాజెక్ట్ -కె`ని దించుతున్నారు.
అమితాబచ్చన్..దీపికా పదుకొణే లాంటి టాప్ స్టార్లను సినిమాలో భాగం చేసారు. విదేశీ టెక్నీషియన్లని సైతం రంగంలోకి దించుతున్నారు. అయితే ఇంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రాని సైతం భాగం చేస్తున్నారు. సినిమాకి సంబంధించి ఆనంద్ మహీంద్రా సాయం కోరుతూ నాగ్ ఆశ్విన్ ఇటీవల వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.
సినిమా కోసం మేము సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. ఇప్పుడీ ప్రపంచం కోసమే కొన్ని ప్రత్యేకమైన వాహనాలు తయారుచేస్తున్నాం. ఇవన్నీ ప్రస్తుత టెక్నాలజీని మించి ఉంటాయి.
ఈ చిత్రాన్ని అనుకున్నట్లు గనుక తీయగలిగితే..అది మన దేశానికే గర్వ కారణం అవుతుంది. మా టీమ్ లో ప్రతిభావంతులైన ఇంజనీర్లు..డిజైనర్లు ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి మీ సహకారం కూడా కావాలి`` అని అశ్విన్ మహీంద్రాని కోరారు. దీనికి ఆనంద్ మహీంద్ర తప్పకుండా మా సహకారం ఎప్పుడ ఉంటుందని బధులిచ్చారు. `మా గ్లోబల్ ప్రొడక్ట్ డెవలె ప్ మెంట్ చీప్ వేలు మహీంద్రా మీకు కావాల్సిన సహకారం అందిస్తారని తెలిపారు.
తాజాగా నేడు సోమవారం చెన్నైలోని నాగ్ అశ్విన్ వేలు మహీంద్రాతో సమావేశమయ్యారు. ఆయనతో మాట మంతి జరిపి ప్రాజెక్ట్ -కె వివరాలు అందించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వేలు మహీంద్రతో కలిసి మహీంద్ర రీసోర్చ్ వ్యాలీని సందర్శించారు. ఆ క్షణాల్ని గుర్తు చేసుకుంటూ నాగ్ అశ్విన్ ఓ ట్వీట్ చేసారు. `ఎంతో అందమైన క్యాంపస్. ఇక్కడ ప్రకృతి ఎంతో బాగుంది. ప్రకృతి సైతం అత్యాధునిక సాంకేతికతను అందుకుంటుంది. వేలు బృందంతో ప్రయాణం ఎంతో బాగుంది.
ఇలాంటి అవకాశం కల్పించిన ఆనంద్ మహీంద్ర సర్ కి ప్రత్యేకమైన`` కృతజ్ఞతలు తెలుపుతున్నా అని అన్నారు. మొత్తానికి మహీంద్ర గ్రూప్ తో `ప్రాజెక్ట్ -కె` ప్రయాణం అధికారికంగా నేటి నుంచి ప్రారంభమైనట్లే. అక్కడ అత్యాధునిక సాంకేతికతను ప్రాజెక్ట్ - కోసం వినియోగించనున్నారు. అందుకోసం మహీంద్ర టీమ్ సైతం రంగంలోకి దిగింది. ఇప్పటికే `ప్రాజెక్ట్ -కె` ప్రారంభమై సెట్ లో ఉన్న సంగతి తెలిసిందే.