Begin typing your search above and press return to search.

టీజ‌ర్‌: బాల్య వివాహంలో థ్రిల్లింగ్ ట్విస్టులు ఆహా!

By:  Tupaki Desk   |   2 March 2022 4:00 AM GMT
టీజ‌ర్‌: బాల్య వివాహంలో థ్రిల్లింగ్ ట్విస్టులు ఆహా!
X
60 వ‌య‌సు అర‌బ్ షేక్ లు ముక్కు ప‌చ్చ‌లార‌ని 12ఏళ్ల బాలిక‌ల్ని పెళ్లాడుతార‌ని విన్నాం.. అలాంటి పెళ్లిళ్ల‌పై మీడియా స్టింగ్ ఆప‌రేష‌న్లు కూడా 24/7 వార్తా చానెళ్ల‌లో చూస్తూనే ఉన్నాం. అధునాతన ప్ర‌పంచంలో అనాగ‌రిక‌త గురించి ప్ర‌జ‌లు ఏవ‌గించుకున్నారు కూడా. హైద‌రాబాద్ పాత బ‌స్తీలో ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎన్నో మీడియా క‌థ‌నాల్లో సంచ‌ల‌నాలు అయ్యాయి. అయినా ఇది ఆగ‌దు. ఇది నిరంత‌ర ప్ర‌క్రియ‌.

ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకుని మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ తో ఆహా ఒరిజిన‌ల్ మూవీని తెర‌కెక్కించిది. `కుబూల్ హై?` అనేది టైటిల్. తాజాగా టీజ‌ర్ విడుద‌లైంది. ఇది హైదరాబాద్ పాత బ‌స్తీ నేపథ్యంలో బాల్య వివాహాలు - అక్రమ రవాణాకు సంబంధించిన క‌థాంశంతో తెర‌కెక్కింది. కాన్సెప్ట్ రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా కాస్త బోల్డ్ గా కూడా ఉంది. నిజానికి ఆహా బృందం చేస్తున్న సాహ‌స‌మనే చెప్పాలి. ఇది కేవలం విజువల్స్ ప‌రంగానే కాదు.. ఎన్నో జీర్ణించుకోలేని నిజాల్ని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

పాత బ‌స్తీలో క్రైమ్ స్టోరీల్ని వెలికి తీస్తోంద‌న్న కుతూహాలం పెరుగుతోంది ఈ టీజ‌ర్ చూస్తే. కొన్ని హార్డ్ హిట్టింగ్ ఇంకా ఆకర్షణీయమైన అంశాల‌పై కంటెంట్ ను తెరపైకి తీసుకువస్తోంది. ఖుబూల్ హై? ఆహా సమర్పణ లో వ‌స్తోంది. పింగిల్ ప్రణవ్ రెడ్డి నిర్మించారు. ఆయ‌న‌ సహ దర్శకత్వం వహించారు. ది ఖుబూల్ హై? ఓ చిన్నారి పెళ్లికూతురు పడుతున్న బాధలను టీజర్ లో చూపించారు.

వివాహాన్ని అనుమతించే ఆమె నివసించే ప్రపంచం కూడా కథనంలో ఒక భాగం. అయితే ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే కొత్తగా పెళ్లైన చిన్నారికి సంబంధించిన థ్రిల్లర్ యాంగిల్. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ట్రైలర్ వచ్చే వరకు ఆగాల్సిందే.

మనోజ్ ముత్యం- వినయ్ వర్మ తెలిసిన వారే అయినా చాలా వ‌ర‌కూ కొత్త ముఖాలు ఇందులో క‌నిపిస్తున్నాయి. టీజ‌ర్ ఉత్కంఠ పెంచింది. ఖుబూల్ హై చిత్రానికి కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ అందించారు.

జెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్ అందించిన నేప‌థ్య‌సంగీతం ప్ర‌ధాన బ‌లం. ఈ సంక్లిష్ట‌మైన‌ థ్రిల్లర్ మార్చి 11న ఆహా వీడియోలో ప్రీమియర్ అవుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆహా ఒరిజిన‌ల్ కంటెంట్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా రూపొందింది. ఇప్పుడు సాహ‌సోపేత‌మైన థ్రిల్ల‌ర్ డ్రామాతో ఖుబూల్ హై వ‌స్తోంద‌ని భ‌రోసా నిచ్చింది టీజ‌ర్.