Begin typing your search above and press return to search.

వంతెన‌పై కార్ల‌తో సీన్.. ఆ లెవ‌ల్లో ఖ‌ర్చు చేశారు!

By:  Tupaki Desk   |   8 March 2022 4:00 AM GMT
వంతెన‌పై కార్ల‌తో సీన్.. ఆ లెవ‌ల్లో ఖ‌ర్చు చేశారు!
X
డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఫ‌లిస్తోంది. ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లో ట్రీటిచ్చేందుకు ఇంకెంతో స‌మ‌యం లేనేలేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా అత్యంత భారీగా మార్చి 11న‌ విడుద‌ల‌వుతోంది.

ప్ర‌స్తుతం డార్లింగ్ ప్ర‌భాస్ - పూజా హెగ్డే స‌హా టీమ్ ప్ర‌చారంలో బిజీబిజీగా ఉన్నారు. ఇక రాధే శ్యామ్ కోసం యువి క్రియేషన్స్ భారీ బ‌డ్జెట్ ను ఎలా ఖర్చు పెట్టింది అనేది ప్రభాస్ వెల్లడించారు.

కొంత‌కాలంగా రాధే శ్యామ్ ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన చాలా సమాచారం ఒకదాని తరువాత ఒకటిగా రివీల‌వుతుండటం ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ... ఈ చిత్రం యూరప్ నేప‌థ్యంతో 1970 కాలంలో జ‌రిగిన క‌థగా సెట్ చేయ‌డంతో ప్రొడక్షన్ డిజైన్ కోసం మేకర్స్ చాలా డబ్బు ఖర్చు చేశారని చెప్పారు.

ఒక వంతెనపై వ‌రుస‌గా కార్లు ఉండే సన్నివేశం ఒక‌టి ఉందని దానికోసం భారీగా ఖ‌ర్చు చేశార‌ని కూడా ప్ర‌భాస్ వెల్ల‌డించారు. మేకర్స్ అంతా బయటకు వెళ్లి యూరప్ నలుమూలల నుండి 60 నుండి 70ల కాలం నాటి పాతకాలపు కార్లను ఎగుమతి చేశారని.. వాటి వల్ల కాస్ట్ చాలా అయ్యింద‌ని ప్రభాస్ చెప్పారు. అయితే సినిమాలో 10 నుంచి 15 సెకన్లు మాత్రమే ఆ సీన్ ఉంటుంది.

UV క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ వారు ఈ చిత్రం కోసం దాదాపు 300 కోట్లకు పైగా ఖర్చు చేశారు. తాజా క‌థ‌నాల ప్రకారం విజువల్స్ అద్భుతంగా ట్రీటిస్తాయ‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రం తెలుగు-త‌మిళం- హిందీ-క‌న్న‌డం-మ‌ల‌యాళంలో అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది. చివ‌రి నిమిషం వ‌ర‌కూ ప్ర‌భాస్ ఈ మూవీ కోసం వ‌ర్క్ చేశారు.

ఎడిటింగ్ రూమ్ లో ఎక్కువ స‌మ‌యం స్పెండ్ చేశారు. అలాగే బాహుబ‌లి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స‌ల‌హాల్ని సూచ‌న‌ల్ని తీసుకుని ఫైన‌ల్ ఔట్ పుట్ ని మెరుగ్గా తీర్చిదిద్దార‌ని రాధేశ్యామ్ బంప‌ర్ హిట్ కొడుతుంద‌ని టీమ్ చెబుతోంది.