Begin typing your search above and press return to search.

నెటిజన్లపై విమర్శలు గుప్పించిన 'రాధేశ్యామ్' సినిమాటోగ్రాఫర్..!

By:  Tupaki Desk   |   14 March 2022 1:30 PM GMT
నెటిజన్లపై విమర్శలు గుప్పించిన రాధేశ్యామ్ సినిమాటోగ్రాఫర్..!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ''రాధేశ్యామ్'' గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థల సంయుక్త నిర్మాణంలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. భారీ అంచ‌నాల‌తో థియేటర్ లలోకి వచ్చిన ఈ పీరియాడికల్ లవ్ డ్రామాకి తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

'రాధే శ్యామ్' సినిమాకు రివ్యూలు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ చిత్రంపై పెద్ద ఎత్తున నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన మనోజ్ పరమహంస ఇన్స్టాగ్రామ్ వేదికగా వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

“సినిమాల కథాంశం మరియు స్క్రీన్‌ ప్లే, పనితీరు గురించి విమర్శకులు పెద్దగా మాట్లాడతారని నేను అంగీకరిస్తున్నాను. కథ యొక్క విజువల్ ప్రాంగణం చాలా గొప్పది కానీ అవాంఛనీయమైనదని నేను చాలా కంప్లైంట్స్ చదువుతున్నాను. ప్రపంచంలో ఎక్కడైనా క్రిటిసిజం ఈ విధంగా ఉంటుందా? ఇప్పటికే అందరికీ టిక్కెట్ల ధరలను నిర్ణయించడానికి చాలా నిబంధనలు ఉన్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వీక్షించడానికి వారు అదనపు డబ్బు చెల్లిస్తున్నారా” అని సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.

''తన అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలనేది ప్రభాస్ సార్ విజన్. రాధేశ్యామ్ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉందని.. ఇది స్టోరీ లైన్‌ ను అధిగమించిందని చాలా మంది అంటున్నారు. మంచి సినిమాటోగ్రఫీ అనేది స్థిరత్వం తప్ప మరొకటి కాదని నేను నమ్ముతున్నాను. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి గ్రీన్ స్క్రీన్ ప్యాచ్ వర్క్‌లు మరియు పోస్ట్ పాండమిక్ హర్డిల్స్‌ తో నేను చాలా ప్రదేశాలలో విఫలమయ్యానని కూడా నేను భావిస్తున్నాను. నా పనిని మెచ్చుకుంటున్న ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది టీమ్ వర్క్‌ కి మంచి ఉదాహరణ'' అని మనోజ్ పేర్కొన్నారు.

''నా తోటి సినిమాటోగ్రాఫర్‌లు చాలా మంది పరిమిత బడ్జెట్ - టైం మేనేజ్మెంట్ మరియు నిర్మాణ సమస్యల కారణంగా వారి సంబంధిత చిత్రాలలో గొప్ప పనిని స్థిరమైన ఫలితాలను ఇవ్వలేకపోతున్నారు. మీరు 'రాధేశ్యామ్' సినిమాలో విజువల్స్ బాగున్నాయని స్థిరంగా ఉన్నాయని మీరు భావిస్తే.. దానికి కారణం ప్రభాస్ సర్ విజన్ మరియు నిర్మాతలే. పోటీతత్వం ఉన్న ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో అన్ని సినిమాలు ఇలాగే నిర్మించబడాలని కోరుకుంటున్నాను'' అని కెమెరామెన్ అన్నారు.

'రాధేశ్యామ్' చిత్రాన్ని 'టైటానిక్‌' తో పోల్చడంపై కూడా మనోజ్ పరమహంస తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో క్లారిటీ ఇచ్చారు. ''ధనవంతులైన అమ్మాయి పేద అబ్బాయితో ప్రేమలో పడటానికి క్లాసిక్ ఉదాహరణ - టైటానిక్. కానీ దర్శకుడు ఇక్కడ మరో 'టైటానిక్‌' ని రూపొందించాలని అనుకోలేదు. ప్రకృతిలోని ఐదు అంశాలకు వ్యతిరేకంగా పోరాడటానికి సముద్రం మధ్యలో ఒక పెద్ద ఓడ మంచి ప్రాంగణం అని అతను భావించాడు'' అని అన్నారు.

ఇకపోతే 'రాధే శ్యామ్' సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ప్రభాస్ సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 151 కోట్ల కలెక్షన్స్ అందుకున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఇదే జోరు కొనసాగించి ఫుల్ రన్ లో భారీ వసూళ్ళు సాధించాలని డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి రాధే శ్యామ్ సినిమా 'ఆర్.ఆర్.ఆర్' మూవీ రిలీజ్ అయ్యే వరకు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.