Begin typing your search above and press return to search.

నేను ప‌బ్లిక్ ఫిగ‌ర్ ని..ప‌బ్లిక్ ప్రాప‌ర్టీని కాదు! ర‌కుల్

By:  Tupaki Desk   |   8 March 2022 3:30 AM GMT
నేను ప‌బ్లిక్ ఫిగ‌ర్ ని..ప‌బ్లిక్ ప్రాప‌ర్టీని కాదు! ర‌కుల్
X
అదేమి ఖర్మంలో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అంటే బొత్తిగా కామెడీ పీస్ అయిపోయింది. ఈ రోజుకీ ఏపీకి రాజధాని ఏదీ అంటే అధికార వైసీపీ మూడు అంటుంది. విపక్ష తెలుగుదేశం మాత్రం అమరావతి అంటుంది. ఇక ఏపీకి ఏది రాజధాని అంటే విభజన చట్టం చూసుకోమని వైసీపీ నేతలు అనడం మరో వింతా విశేషం.

విభజన చట్టం ప్రకారం చూసుకుంటే ఏపీకి, తెలంగాణాకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. అంటే 2014లో జూన్ ఫస్ట్ అపాయింటెడ్ డే అయితే 2024 జూన్ ఫస్ట్ దాకా హైదరాబాద్ ఏపీకి కూడా రాజధానే. మరి ఈ సంగతి అందరికీ తెలిసినా గత ఏడేళ్ళుగా అమరావతే రాజధాని అని అంటున్నారు. మరో వైపు చూస్తే మూడు రాజధానుల విషయంలో తమ పంతం నెగ్గనందుకు మల్లగుల్లాలు పడుతున్న వైసీపీ అయితే ఏపీకి రాజధానిగా ఇంకా హైదరాబాదే ఉందని గుర్తు చేస్తోంది.

దీని మీద సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ఏపీకి ఇంకా హైదరాబాదే రాజధానిగా ఉంది అని అనడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మీకు అంత సరదాగా ఉంటే హైదరాబాద్ వెళ్లి అక్కడ నుంచి పాలించుకోండి ఎవరు వద్దన్నారు అని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. తాము ఏపీకి స్థిరమైన రాజధాని ఉండాలనే ఆనాడు అమరావతిని ఎంపిక చేశామని ఆయన చెప్పుకున్నారు.

మరో వైపు చూస్తే మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బొత్స సహా సీనియర్ మంత్రులు పదే పదే చెప్పడం పైనా టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. హైకోర్టు ఏపీ రాజధాని అమరావతి అని స్పష్టమైన తీర్పు ఇచ్చినా కూడా అధికార పార్టీ నేతలు ఇంకా మూడు నాలుగు అంటూ మాట్లాడం దారుణమనే అంటున్నారు.

మొత్తానికి ఏపీకి అమరావతి రాజధానా, లేక మూడు రాజధానులా అన్నది ఒక వైపు వైసీపీ టీడీపీల మధ్య వేడి వేడిగా వాదనలు జరుగుతూంటే మధ్యలో హైదరాబాద్ ని తెచ్చేశారు. మరి దీంతో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న దాన్ని కావాలనే గుర్తుకు తెచ్చారా లేక అమరావతిని ఒప్పుకోలేకనే ఈ ప్రస్థావనను తెచ్చారా అన్నది మాత్రం ఇప్పటికైతే తేలని విషయమే.

ఏది ఏమైనా ఇపుడు రాజధాని గొడవలో హైదారాబాద్ కూడా కొత్తగా వచ్చి చేరిపోయింది మరి. దీని మీద తెలంగాణా రాజకీయం ఏమంటుందో చూడాలి.