Begin typing your search above and press return to search.
రిలీజ్ వేళ `ఆర్ ఆర్ ఆర్`కు బిగ్ షాక్
By: Tupaki Desk | 5 March 2022 10:30 AM GMTదేశ వ్యాప్తంగా అభిమానులు, సినీ లవర్స్ `ఆర్ ఆర్ ఆర్` మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొంత కాలంగా కరోనా తో పాటు వివిధ కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ వరుసగా వాయిదాపడుతూ వస్తోంది. జనవరి 7న సంక్రాంతి బరిలో ఈ మూవీని నిలపాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్ ని చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇద్దరు స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి కలిసి నటించిన సినిమా.. వేరు వేరు ప్రాంతాల స్వాతంత్య్రం కోసం పోరాడిన ఇద్దురు యోధులు.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమరం భీంల ఫిక్షనల్ కథగా ఈ చిత్రాన్నితెరకెక్కించడంతో ఈ ప్రాజెక్ట్ పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అంతే కాకుండా అల్లూరి సీతారామ రాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించడం.. ఆదివాసీ గోండు వీరుడు కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించడం. ఈ ఇద్దరు ఈ పాత్రల్లో ఎలా వుంటారా? .. ఏ విధంగా ఫైట్ చేశారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుడం.. రీసెంట్ గా విడుదల చేసిన సాంగ్స్ .. మూవీ ట్రైలర్ ఊహలకు మించి వుండటంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ట్రైలర్ లో ఇద్దరు హీరోలు సింహాలై గర్జించిన తీరు రోమాంచితంగా వుండటంతో ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లలోకి వస్తుందా? ఎపక్పుడెప్పుడు చేసేయాలా అనే ఉత్సుకత సినీ అభిమానులో అంత కంతకు పెరిగిపోతోంది.
ప్రేక్షకుల్లో రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోతుంటే సినిమాపై రోజుకో వివాదం వెలుగులోకి వస్తోంది. జనవరిలో సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ హడావిడి చేస్తున్న సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ మహిళ `ఆర్ ఆర్ ఆర్`పై సంచలన ఆరోపణలు చేస్తూ హైకోర్టులో ఫిర్యాదు చేయడం చర్చనీయావంశగా మారింది. ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ ని కించపరుస్తూ సినిమా తీశారని, ఈ చిత్ర విడుదలని నిలిపి వేయాలని కోరుతూ ఏపీ కి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆ వివాదం ముగిసింది అనుకుని మార్చి 25న సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతున్న వేళ మరోసారి `ఆర్ ఆర్ ఆర్` చుట్టూమరో వివాదం చోటు చేసుకోవడం అభిమానుల్ని కలవరానికి గురిచేస్తోంది.
భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ `ఆర్ ఆర్ ఆర్`కు మరో షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ నిస్వార్థంగా దేశం కోసం పోరాడిన వీరులని డబ్బు కోసం కించపరిచేలా `ఆర్ ఆర్ ఆర్` సినిమా వుందని ఈ సందర్భంగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల చరిత్రను వక్రీకరిస్తూ రాజమౌళి సినిమా తీశారని, అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారి వద్ద పోలీస్ ఆఫీసర్ గా పనిచేశారని, అమ్మాయిలతో డ్యాన్స్ చేశారని చూపించారని, ఇలాంటి చిత్రాన్ని ముందు చరిత్రకారుల కుటుంబాలకు ముందు చూపించాలని, వారి అభ్యంతరాల మేరకు అందుకు సంబంధించిన సన్నివేశాలని తొలగించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధులను వ్యాపారం కోసం వాడుకుంటున్నారని, రాజమౌళి గొప్ప డైరెక్టరే ఆయన చేసిన మగధీర, బాహుబలి చిత్రాలకు తప్పుపట్టడం లేదు. సినిమాని సినిమాలాగే చూడాలప్పుడు వాళ్ల పేర్లెందుకు పెట్టారు? .. ఈ మూవీతో రాజమౌళి యువతని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సెంట్రల్ సెన్సార్ బోర్డు వద్ద త్వరలో దీక్షలు చేపడతాం` అని తెలిపారు రామకృష్ణ.