Begin typing your search above and press return to search.

#RRR : ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ స్థాయి హడావుడికి కారణం ఏంటి!

By:  Tupaki Desk   |   14 March 2022 10:30 AM GMT
#RRR : ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ స్థాయి హడావుడికి కారణం ఏంటి!
X
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ నెల 25వ తారీఖున భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యి దాదాపుగా నాలుగు సంవత్సరాలు అవుతోంది. పలు కారణాల వల్ల సినిమా చాలా ఆలస్యంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా విడుదలను ఒక పండుగ స్థాయి లో సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వారు ఏ స్థాయిలో హడావిడి చేస్తున్నారో సోషల్ మీడియాలో వీడియోలు మరియు ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. ముఖ్యంగా ఓవర్సీస్ ఫ్యాన్స్ భారీ ఎత్తున హడావిడి చేస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ మరియు ఆర్‌ఆర్ఆర్ అంటూ పెద్ద ఎత్తున కార్లతో ఒక విన్యాసాన్ని చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇక తాజాగా విమానం వెనుక ఎన్టీఆర్ పేరు మరియు ఆర్ ఆర్‌ ఆర్ సినిమా పేరు డైలాగ్ ఉన్న ప్లేక్సీ ని పెట్టి గాలిలో ఎగర వేసిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఎన్టీఆర్ అభిమానులు ఇదే కాకుండా ముందు ముందు మరింత సందడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో సినిమా విడుదలను సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

వేల కొద్దీ ఫ్లెక్సీలను ఎన్టీఆర్ పేరుతో డిజైన్ చేయించడంతో పాటు ఇప్పటికే ఆయా థియేటర్ల వద్ద మరియు ఏరియాల్లో కట్టేశారు. రికార్డు స్థాయి హోర్డింగ్‌ లను మరియు ఫ్లెక్సీలను థియేటర్ వద్ద ఏర్పాటు చేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సమయంలో ఎన్టీఆర్ అభిమానులు ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత తర్వాత ఆయన నుండి మరే సినిమా రాలేదు. అరవింద సమేత 2018 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా విడుదల అయి దాదాపుగా నాలుగు సంవత్సరాలు అవుతుంది. ఈ నాలుగు సంవత్సరాలలో ఆయన నుండి సినిమా లు లేకపోవడంతో అభిమానులు ఆకలి మీద ఉన్నారంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆకలి మీద ఉన్న అభిమానులకు ఆర్‌ఆర్ఆర్ వంటి భారీ సినిమా రాబోతున్న నేపథ్యంలో ఆగలేక పోతున్నారు. అందుకే ఈ స్థాయి హడావిడి చేస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మరో వైపు మెగా అభిమానులు కూడా హడావిడి కి సిద్ధం అవుతున్నారు. సినిమా విడుదల సమయానికి నందమూరి మరియు మెగా అభిమానుల సందడి ఎలా ఉంటుందో ఊహకు అందడం లేదు.