Begin typing your search above and press return to search.

స‌మంత ఇంట్లో మ‌ళ్లీ వివాదం!

By:  Tupaki Desk   |   5 March 2022 4:30 PM GMT
స‌మంత ఇంట్లో మ‌ళ్లీ వివాదం!
X
స‌మంత తో పాటు ఇంట్లో మ‌రో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యుల్లా భావించే సాషా..హ‌షా ఉన్న సంగ‌తి తెలిసిందే. సామ్ కి ఖాళీ స‌మయం దొరికితే సాషా- హ‌సాల‌తోనే ఆడుకుంటుంది. వాటితోనే స‌మ‌యాన్ని గ‌డుపుతుంది. వాటికి ఫుడ్ తినిపించ‌డం ద‌గ్గ‌ర నుంచి ప‌డుకునే వ‌ర‌కూ ఆ బాధ్య‌త‌ల‌న్నింటిని సామ్ ద‌గ్గ‌రుండి చూసుకుంటుంది.
స‌హ‌జంగానే స‌మంత పెట్ ల‌వ‌ర్. సాసా హ‌షాలు త‌న ద‌గ్గ‌ర‌కు రాక‌ముందే మూగ‌జీవాల్ని స‌మంత ఇష్ట‌ప‌డేది. ఆ రెండు స‌మంత ఇంటికొచ్చిన త‌ర్వాత కుటుంబ స‌భ్యులైపోయాయి. వాటికి సంబంధించిన వీడియోల్ని స‌మంత ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌కు షేర్ చేస్తుంటుంది.

తాజాగా సాషా..హ‌షాల అల్ల‌రి గురించి రివీల్ చేసింది. సాషా ఇటీవ‌లే సామ్ వ‌ద్ద‌కి వ‌చ్చింది. హ‌షా ఎప్ప‌టి నుంచో సామ్ తో ఉంటుంది. హ‌షాకి తోడుగానే సాషాని తీసుకొచ్చింది. అయితే ఈరెండింటీకి మొద‌ట్లో అస్స‌లు ప‌డేది కాదంట‌. కాల‌క్ర‌మేణా స్నేహిత‌లైపోయాయి. అయినా అప్పుడ‌ప్పుడు కుక్క త‌న స్వ‌భావాన్ని బ‌య‌ట‌పెడుతుందిగా. అలాంటప్పుడు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటోంది. జీవితంలో సిబ్లింగ్స్ మ‌ధ్య గొడ‌వ‌లు వ‌స్తాయ‌ని తెలుసు. ఇప్పుడు మ‌ళ్లీ ఇచ్చాయి` అని తెలిపింది స‌మంత‌.

ఇలా రెండు పెట్స్ మ‌ధ్య స‌మ‌స్య‌ల్ని చివ‌రికి ఎలాగూ స‌మంత ప‌రిష్క‌రించింది అనుకోండి. ప్ర‌స్తుతం ఆ రెండు ఇంట్లో ఎంచక్కా ఆడుకుంటున్నాయి. స‌మంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమా అప్డేట్స్ తో పాటు.. వ్య‌క్తిగ‌త విష‌యాల్ని..మోటీవేష‌న‌ల్ అవేర్ నేస్ తీసుకొచ్చే అంశాల్ని ఎక్కువ‌గా పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవ‌లే ర‌ష్యా-ఉక్రెయిన్ వార్ పై కూడా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించింది.

ఇక స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌లే `శాకుంతలం` షూటింగ్ పూర్తిచేసింది. అలాగే మ‌రో లేడీ ఓరియేంటెడ్ చిత్రం `య‌శోద` చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లింది.

ఈ సినిమా మొద‌టి షెడ్యూల్ కూడా పూర్త‌యింది. తెలుగు..త‌మిళ్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. క‌న్న‌డ‌..మ‌ల‌యాళ..హిందీ భాష‌ల్లో కూడా రిలీజ్ చేయ‌నున్నారు. అలాగే కోలీవుడ్ లో విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న `క‌థువ‌కుల రెండు కాద‌ల్` అనే సినిమాలోనూ న‌టిస్తోంది. `అరేంజ్ మెంట్స్ ఆఫ్ ల‌వ్` అనే విదేశీ చిత్రంలో న‌టిస్తుంది.