Begin typing your search above and press return to search.

ఇండియాస్ బిగ్గెస్ట్‌ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గా భీమ్లా మేకర్స్‌

By:  Tupaki Desk   |   14 March 2022 11:30 AM GMT
ఇండియాస్ బిగ్గెస్ట్‌ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గా భీమ్లా మేకర్స్‌
X
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న నిర్మాణ సంస్థల పేర్ల లో సితార ఎంటర్టైన్మెంట్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాధాకృష్ణ హాసిని అండ్‌ హారిక బ్యానర్ ను నిర్వహిస్తున్నారు. ఆ బ్యానర్‌ కాకుండా సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ కూడా ఆయనదే అనే టాక్ ఉంది. కాని అధికారికంగా మాత్రం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నాగ వంశీ ఆధ్వర్యంలో నడుస్తుంది.

సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో ఏ సినిమా వచ్చినా కూడా హాసిని అండ్‌ హారిక కు సంబంధించిన వారే అంటే రాధాకృష్ణ మరియు త్రివిక్రమ్ ఇంకా ఇతర మెంబర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. తాజాగా విడుదలైన భీమ్లా నాయక్‌ సినిమా ను హాసిని అండ్ హారిక బ్యానర్ లో కాకుండా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మించిన విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో రూపొందిన భీమ్లా నాయక్ మరియు డీజే టిల్లు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

మరిన్ని సినిమాలు కూడా ఈ బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గా మారడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. చాలా గొప్ప సినిమాలకు పెద్ద సినిమాలకు మాత్రమే ఇలాంటి నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూషన్ కి సిద్ధమవుతాయి. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమా డిస్ట్రిబ్యూట్‌ చేసేందుకు ఈ భారీ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది.

సితార ఎంటర్టైన్మెంట్ వారు జక్కన్న సినిమా ని ఆస్ట్రేలియాలో పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియా ఓవర్ సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. అక్కడ భారీ ఎత్తున విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు వారితో పాటు ఇండియన్స్ అత్యధికంగా ఉండే ఆస్ట్రేలియాలో ఈ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. అందుకే సితార ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాను ఏకంగా రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తుంది.

ఆస్ట్రేలియాలో కచ్చితంగా ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లను వసూలు చేసి తీరుతుందనే విశ్వాసంతో సితార ఎంటర్టైన్మెంట్ వారు ఇంత భారీ మొత్తాన్ని సినిమాకు పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఎన్టీఆర్.. చరణ్ సినిమా అవడంతో కచ్చితంగా ఈ సినిమా భారీ మొత్తాన్ని ఆస్ట్రేలియాలో రావడం ఖాయం. కనుక సితార ఎంటర్టైన్మెంట్స్ వారి మొదటి ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్ వెంచర్ కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకొని అత్యధిక లాభాలు తెచ్చిపెడుతుందని నమ్మకం సినీ విశ్లేషకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.