Begin typing your search above and press return to search.
మార్పు మొదలైంది.. హ్యాట్సాఫ్ సూర్య
By: Tupaki Desk | 7 March 2022 4:16 AM GMTస్టార్ హీరోలు అంతా కూడా కమర్షియల్ సినిమాలపైనే పడుతున్నారు. తమను నమ్ముకుని కోట్లకు కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేసే నిర్మాతల లాభం కోసం మరియు తమ అభిమానుల ఆనందం కోసం అంటూ స్టార్ హీరోలు ఎప్పుడు చూసినా కమర్షియల్ సినిమాలను మాత్రమే చేస్తున్నారు. కొందరు ఫిల్మ్ మేకర్స్ ఇతర సినిమాల కథలను తీసుకు వచ్చే ప్రయత్నం చేసినా కూడా దాన్ని హీరోలు అంగీకరించే పరిస్థితి లేదు.
టాలీవుడ్ లో స్టార్ హీరోలు దాదాపు అంతా కూడా కమర్షియల్ చట్రం లో చిక్కుకుని సినిమాలు చేస్తున్నారు. కాస్త వైవిధ్యభరిత సినిమాలను కాని.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను కాని వారు చేసేందుకు సిద్దం అవ్వడం లేదు. యంగ్ స్టార్ హీరోలు కూడా మూస తరహా కమర్షియల్ సినిమాలను చేస్తున్న ఈ సమయంలో తమిళ స్టార్ హీరో సూర్య ఎంతో మంది హీరోలకు ఆదర్శంగా నిలుస్తూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాడు.
మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ కు దూరంగా ఉండే సినిమాలను అప్పుడప్పుడు చేయడం ద్వారా నటుడిగా సూర్య తనకు తాను సంతృప్తి పర్చుకోవడంతో పాటు సినిమా స్థాయిని పెంచుతున్నాడు అనడంలో సందేహం లేదు. అద్బుతమైన జై భీమ్ మాత్రమే కాకుండా అంతకు ముందు వచ్చిన ఆకాశమే నీ హద్దుగా ఇంకా కొన్ని ఆయన గత సినిమాలు ఇండస్ట్రీలో మార్పు ను తెచ్చేవిగా ఉన్నాయి.
కంటెంట్ బాగుంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అక్కర్లేదు అంటూ నిరూపించిన సూర్య ను ఆదర్శంగా తీసుకుని వరుసగా సినిమాలను చేసేందుకు పలువురు ఫిల్మ్ మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న సూర్య నటించిన ఈటీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా కూడా సూర్య ను కొత్తగా చూపించేందుకు సిద్దంగా ఉంది.
మంచి కథ మరియు నేపథ్యంను ఎంపిక చేసుకుని అప్పుడప్పుడు మంచి కాన్సెప్ట్ సినిమాలను కూడా తీసుకు రావాలని అభిమానులు ఇప్పుడు ఇతర స్టార్ హీరోలను కోరుతున్నారు. రెగ్యులర్ గా కమర్షియల్ సినిమాలు కాకుండా అప్పుడప్పుడు అయినా ఇతర తరహా సినిమాలు చేయడం ద్వారా సమాజంలో మార్పు తీసుకు రావచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సూర్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఏదో సమాజాన్ని పూర్తిగా మార్చి వేయాలనే ఉద్దేశ్యంతో ఈ తరహా సినిమాలను చేయడం లేదు. నాకు సంతృప్తిని కలిగించే సినిమాలను చేస్తున్నాను. నా సినిమాల వల్ల ఒక్క వ్యక్తి మారినా కూడా సంతోషం. అదే సమయంలో నా సినిమా కొందరిలో ఆలోచన కలిగించినా కూడా నేను సక్సెస్ అయినట్లే అంటూ సూర్య చెప్పుకొచ్చాడు. సూర్య లో వచ్చిన మార్పు ఇతర స్టార్స్ లో వచ్చేందుకు ఎక్కువ కాలం పట్టదు. మార్పును మొదలు పెట్టిన సూర్య కు హ్యాట్సాఫ్.