Begin typing your search above and press return to search.
అజిత్ ను చూసి కూడా ఆవేశపడితే ఎలా సూర్య?
By: Tupaki Desk | 7 March 2022 4:47 AM GMTఒక సినిమాకి కథాకథనాలు .. పాత్రకి తగిన నటీనటులు .. తెరపై వాటిని ఆవిష్కరించే సాంకేతిక నిపుణులు ఎంత అవసరమో, ఆ సినిమాకి విడుదల సమయం కూడా అంతే అవసరం. అన్నీ బాగున్నా కొన్ని సినిమాలు అంతగా ఆడకపోవడానికి కారణం, రాంగ్ టైమ్ లో రిలీజ్ చేయడమే.
ఒక సినిమా విజయంలో దాని విడుదల సమయం కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుందనే విషయాన్ని చాలా సినిమాలు నిరూపించాయి. ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ ఈ విషయం తెలుసు. అందువల్లనే చాలామంది సరైన విడుదల సమయం కోసం వెయిట్ చేస్తుంటారు.
ఇక ఒక సినిమా సక్సెస్ లో ఆ సినిమా టైటిల్ కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. కథ ఏ జోనర్ కి సంబంధించినది? .. ఏ వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు? ఇలా ఒక కథ మొత్తాన్ని ఒక్క ముక్కలో తేల్చేదిగా టైటిల్ ఉంటుంది. సరైన టైటిల్ లేకపోవడం వలన దెబ్బతిన్న సినిమాలు కూడా చాలానే కనిపిస్తాయి. అందువలన చాలామంది తమ సినిమాల టైటిల్ విషయంలో చాలా కసరత్తు చేస్తుంటారు. కథకి దూరంగా .. హీరో ఇమేజ్ కి దూరంగా ఉన్న టైటిల్స్ .. అర్థంకాని .. టైటిల్స్ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కావు.
గతంలో తమిళం నుంచి ఏ సినిమా తెలుగుకు వచ్చినా తెలుగు టైటిల్ నే పెట్టేవారు. డబ్బింగ్ సినిమాకి టైటిల్ ఇలాగే ఉండాలి అన్నట్టుగా పెట్టినా, తెలుగులోనే ఉంది కదా .. ఓకే అనుకుని ఆడియన్స్ కాస్త ఆసక్తిని చూపేవారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి, ఓకే టైటిల్ తో అన్ని ఇతర భాషల్లోను తమ సినిమాను రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఇటీవల వచ్చిన అజిత్ 'వలిమై' అలాంటిదే. అజిత్ కి గల క్రేజ్ పరంగా .. బడ్జెట్ పరంగా ఇది పెద్ద సినిమా. తమిళంలో 3 రోజుల్లో ఈ సినిమా 100 కోట్లు రాబట్టింది. తెలుగులో మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
ఎందుకంటే 'వలిమై' అంటే ఏమిటో .. తెలుగులో దాని అర్థం ఏమిటో చాలామందికి తెలియదు. చెప్పే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఇక పవన్ కల్యాణ్ క్రేజ్ ను పట్టించుకోకుండా 'భీమ్లా నాయక్' కి ముందురోజు ఈ సినిమాను థియేటర్స్ లో దింపారు. దాంతో 'వలిమై' థియేటర్స్ లో ఉందనే విషయాన్ని గమనించే పరిస్థితి లేకుండా పోయింది.
ఇదంతా చూస్తూ కూడా సూర్య 'రాధేశ్యామ్' రిలీజ్ కి ఒక రోజు ముందుగా ఈ నెల 10వ తేదీన తన సినిమా 'ఈటి'ని విడుదల చేస్తున్నాడు. ట్యాగ్ లైన్ గా ఉంచిన 'ఎవరికీ తలవంచడు' అనేది టైటిల్ గా పెట్టినా బాగానే ఉండేది. కానీ ఏ విధంగానూ అతకని రెండు పొడి అక్షరాలతో టైటిల్ సెట్ చేయడం ఇబ్బంది కలిగించే విషయమే. పైగా దర్శకుడు పాండిరాజ్ గురించి ఇక్కడివారికి పెద్దగా తెలియదు కూడా. ఈ మూడు అంశాలను సూర్య దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుందేమో.