Begin typing your search above and press return to search.

చిరు ఎఫెక్ట్‌.. త‌మ‌న్నా త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మా?

By:  Tupaki Desk   |   29 May 2022 6:31 AM GMT
చిరు ఎఫెక్ట్‌.. త‌మ‌న్నా త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మా?
X
మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ముంబైలో జ‌న్మించిన ఈ ముద్దుగుమ్మ‌.. 13వ ఏటే సినీరంగ ప్రవేశం చేసింది. ఎలాంటి బ్యాక్ గ్రైండ్ లేక‌పోయినా త‌ల్లిదండ్రుల‌ ప్రోత్సాహంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌, కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

ప్ర‌స్తుతం నార్త్ లోనూ స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న త‌మ‌న్నా.. ఆ మధ్య కెరీర్ ప‌రంగా కాస్త స్లో అయిన‌ప్ప‌టికీ మళ్లీ పికప్ అవ్వడానికి వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్ ల‌తో పాటు అడ‌పా త‌డ‌పా ఐటెం సాంగ్స్ లోనూ మెరుస్తూ బిజీ షెడ్యూల్ ను మెయిన్‌టైన్ చేస్తోంది

ఇక‌పోతే ఈ అమ్మ‌డు మూడు ప‌దుల వ‌య‌సు వ‌చ్చినా పెళ్లి ఊసే ఎత్తక‌పోవ‌డంతో.. అభిమానులు ఎప్ప‌టి నుంచో వ‌ర్రీ అవుతున్నారు. గ‌తంలో త‌మ‌న్నా పెళ్లి సెట్ అయింద‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే ఈసారి మాత్రం తమ‌న్నా పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మంటూ తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందుకు కార‌ణం మెగాస్టార్ చిరంజీవినే.

అస‌లు చిరంజీవికి, త‌మ‌న్నా పెళ్లికి సంబంధం ఏంటీ..? అన్న సందేహం రాక‌మాన‌దు. అయితే సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ఎంత పెద్ద పీట వేస్తారో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఒక్కోసారి కొన్ని గ‌మ్మ‌త్తైన సెంటిమెంట్లు సైతం తెర‌పైకి వ‌స్తుంటాయి. అలాంటి సెంటిమెంట్ ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి సరసన రెండో సారి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్లకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయ‌ట‌.

ఇందుకు కాజ‌ల్‌, నాయ‌న‌తార‌లే సాక్ష్యం అని అంటున్నారు నెటిజ‌న్లు. చిరు స‌ర‌స‌న `ఖైదీ నెంబర్ 150`లో న‌టించిన కాజ‌ల్‌.. ఆపై `ఆచార్య‌`కు సైన్ చేసింది. ఆ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉన్న‌ప్పుడే ఆమెకు పెళ్లైపోయి.. మొన్నీ మ‌ధ్య ఓ పండంటి బిడ్డ‌కు కూడా జ‌న్మ‌నిచ్చింది. అయితే ఆచార్య‌లో కాజ‌ల్ పార్ట్ ను తొలిగించార‌నుకోండి. అది వేరే విష‌యం.

అలాగే న‌యన్ `సైరా` సినిమాలో చిరుతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది. మ‌ళ్లీ ఇటీవ‌ల ఆయ‌న హీరోగా తెర‌కెక్కుతున్న `గాడ్ ఫాదర్`కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క‌ట్ చేస్తే కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ తో ఈమె పెళ్లి తేదీ లాక్ అయింది.

ఇక ఈ సెంటిమెంట్ నేప‌థ్యంలోనే త‌మ‌న్నా సైతం త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్కుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. `సైరా`లో సెకెండ్ హీరోయిన్‌గా చేసిన త‌మ‌న్నా.. ఇప్పుడు చిరు స‌ర‌స‌న `భోళా శంకర్`లో న‌టిస్తోంది. ఒక‌వేళ చిరు ఎఫెక్ట్ తో త‌మ‌న్నా పెళ్లైతే.. ఆమె అభిమానులు పండ‌గ చేసుకోవ‌డం ఖాయం.