Begin typing your search above and press return to search.
ఆ వయసు నుంచే తమన్ కు కష్టాలు మొదలయ్యాయా?
By: Tupaki Desk | 25 July 2022 8:05 AM GMTఉన్నత శిఖరాల్ని అధిరోహించిన ప్రతీ ఒక్కరి జీవితంలోనూ చేధు జ్ఞాపకాలు చాలానే వుంటాయి. అవన్నింటినీ భరిస్తూ పట్టుదలతో ముందుకు సాగితేనే విజయం. అలా పట్టుదలతో నమ్మిన రంగంలో సక్సెస్ సాధించి తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోని కదిలించినా ప్రముఖంగా వినిపించే పేరు తమన్. తనదైన మార్కు సంగీతంతో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు తమన్.
ప్రస్తుతం వున్న ఈ స్థాయి అతనికి ఆషామాషీగా రాలేదు. ఎంతో శ్రమించి, ఎన్నో కష్టాలని ఎదుర్కోన్న తరువాతే ఈ స్థాయికి రాగలిగారు. తమన్ ఈ రంగంలో ప్రవేశించిన జూలై 24న నాటికి 28 ఏళ్లు పూర్తయిందట. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ తమన్ షేర్ చేసిన అరుదైన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తమన్ షేర్ చేసిన ఫొటోపై నెట్టింట కామెంట్ లు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల ఫ్యాన్స్ గ్రేట్ జర్నీ అని, తమ హీరోలకు టెర్రిఫిక్ మ్యూజిక్ ని అందించమని తమన్ కు రిక్వెస్ట్ లు చేస్తున్నారు.
1994లో 11 ఏళ్ల వయసులో తమన్ తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారట. నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన చిత్రం `భైరవద్వీపం`. రోజా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మాధవ పెద్ది సురేష్ సంగీతం అందించారు. జానపద చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీని చందమామ విజయా కంబైన్స్ బ్యానర్ పై బి. వెంకటరామిరెడ్డి నిర్మించారు. ఈ మూవీతో తమన్ సంగీత ప్రయాణం మొదలైందట. ఈ సినిమా కోసం రికార్డింగ్ థియేటర్లో తమన్ తొలిసారి అడుగుపెట్టారట.
ఆ నాటి ఫొటోని తాజాగా తమన్ నెటిజన్ లతో పంచుకుంటూ ఆసక్తికరంగా స్పందించారు. 11 ఏళ్ల పసి ప్రాయంలో తమన్ కష్టాలు మొదలయ్యాయని చెప్పకనే చెప్పేశాడు. చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో చదువుకోవాల్సిన వయసులో తమన్ తల్లికి తోడుగా నిలబడ్డాడట.
పసి ప్రాయంలోనే సంగీతంతో అనుబంధాన్ని పెంచుకున్న తమన్ ఆ తరువాత మణిశర్మ, రాజ్ కోటి వంటి దర్శకుల వద్ద శిష్యరికం చేశాడట. కీ బోర్డ్ న్లేయర్ గా పని చేసిన తమన్ ఆ తరువాత డైరెక్టర్ శంకర్, మాస్ మహారాజా రవితేజల ప్రోత్సాహంతో సంగీత ప్రపంచంలో సంగీత దర్శకుడిగా రాణించడం మొదలు పెట్టాడు.
రవితేజ కిక్, శంకర్ `వైశాలి` చిత్రాలకు తమన్ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచి అతనికి తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా టాప్ మ్యూజిక్ డైరెక్ట్ స్థాయికి చేరుకోవడానికి బాటలు వేసింది. ప్రస్తుతం టాప్ స్టార్ హీరోలతో పాటు స్మాల్ హీరోల చిత్రాలకు కూడా సంగీతం అందిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు తమన్. టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా మూవీస్ కి సంగీతం అందిస్తున్నాడు.