Begin typing your search above and press return to search.
'కశ్మీర్ ఫైల్స్' కాక బాక్సాఫీస్ వద్ద మామూలుగా లేదే!
By: Tupaki Desk | 21 March 2022 8:30 AM GMTఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలీవుడ్ చిత్రం `కశ్మీర్ ఫైల్స్` సంచలనాల దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ సాగుతుంది. సినిమాలో కంటెంట్..వివాదాస్పద అంశాలు సినిమాని తొలి షో అనంతరం అలా అమాంతం పైకి లేపాయి. ప్రస్తుతం భారీ వసూళ్లు దిశగా దూసుకుపోతుంది. 300 కోట్ల వసూళ్లని సునాయాసంగా ఛేదిస్తుంది? అన్న టాక్ తో దూసుకుపోతుంది.
ఎవరు చూస్తారు? ఈ సినిమా అని విమర్శించిన నోళ్లే ఇప్పుడు ప్రశసంలు కురిపిస్తున్నాయి. లో బడ్జెట్ సినిమా..నెల రోజుల్లో షటింగ్ పూర్తిచేసారు.. సినిమాలో ఏముంది? సెన్సార్ బోర్డు దగ్గర ఇబ్బందులు.. ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కుని `కశ్మీర్ ఫైల్స్` ప్రేక్షకుల ముందుకు వచ్చి నీరాజనాలు అందుకోవడం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. తొలిరోజు మౌత్ టాక్ పాజిటివ్ గా రావడంతోనే సినిమా జనాల్లోకి దూసుకుపోయింది. ఒక్కసారిగా సినిమాకి హైప్ క్రియేట్ అయింది.
దానికి తోడు వివాదాస్పద అంశాలు సినిమాని పీక్స్ కి తీసుకెళ్లాయి. చాలా తక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా కి పాజిటిటాక్ రావడంతో థియేటర్ల సంఖ్య నెమ్మదిగా పెరిగింది. దీంతో బాక్సాఫీస్ వసూళ్లు పెరిగాయి.
ట్రేడ్ పండితుల అంచనాలు తప్పాయి. గత పది రోజులుగా `కశ్మీర్ పైల్స్` పై నడుస్తోన్న టాక్ ఇది. ముందుగా ఈ సినిమా 100 కోట్ల సినిమా అన్నారు. ఇ ప్పుడేమో 200 కోట్ల ని మించి 300 కోట్ల వసూళ్లను సునాయాసంగా సాధిస్తుందని టాక్ వినిపిస్తోంది.
ట్రేడ్ వర్గాలు సైతం ఈ లెక్క విషయంలో పాజిటివ్ గానే రిపోర్ట్ ఇస్తుండటం విశేషం. మొదటి రోజు మూడు కోట్లు గ్రాస్ వసూళ్లు తెచ్చిన సినిమా రెండవ అదివారం 30 కోట్ల గ్రాస్ లోకి వెళ్లిపోయింది. అటుపై పదో రోజు పదిరెట్ల వసూళ్లు చూస్తే దిమ్మ తిరిగిపో యింది. ఇప్పటికే సినిమా వసూళ్లు 180 కోట్లకు పైగా దాటిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకి పోటీ కూడా లేదు.
`ఆర్ ఆర్ ఆర్` పాన్ ఇండియా కేటగిరిలో రిలీజ్ అయినా ఉత్తరాదినా అంత ఇంపాక్ట్ ఉండాలంటే అద్భుతాలు జరగాలి. అయినా `కశ్మీర్ ఫైల్స్` లాంటి సినిమాకి `ఆర్ ఆర్ ఆర్ ` పోటీ కానే కాదు అన్న అనేది మరో వాదన కూడా తెరపైకి వస్తోంది. రెండు డిఫరెంట్ జానర్ సినిమాలు. `కశ్మీర్ పైల్స్` ఇంకొన్ని రోజుల పాటు హిందీ బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయంగా ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.