Begin typing your search above and press return to search.
దళపతి దండయాత్రకు సైరన్ మోగింది
By: Tupaki Desk | 6 April 2022 11:45 AM GMTతెలుగులో తమిళ స్టార్ హీరో విజయ్ ఇంత వరకు ఏ సినిమా చేయలేదు. తను నటించిన చాలా వరకు హిట్ చిత్రాలు తెలుగులో రీమేక్ అయి బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచాయి. హీరోగా తమిళంలో స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న విజయ్ కి తెలుగులో మాత్రం ఇప్పుడిప్పుడే మార్కెట్ ఏర్పడుతోంది. ఆయన నటించిన కొన్ని చిత్రాలు ఇటీవల తెలుగులో విడుదలై మంచి విజయాల్ని సాధించాయి. ఈ నేపథ్యంలో విజయ్ తొలిసారి తెలుగులో స్ట్రెయిట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్ మూవీగా రూపొందనున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, పరమ్ వీ పొట్లూరి, పెరల్ వీ పొట్లూరి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్స్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. క్రేజీ లేడీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ ని పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్న ఈ మూవీని బుధవారం లాంఛనంగా చెన్నైలో ప్రారంభించారు. బుధవారం నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.
`బీస్ట్` తరువాత విజయ్ నటిస్తున్న చిత్రమిది. అంతే కాకుండా విజయ్ 66వ సినిమా కావడం.. అందులోనూ ద్విభాషా చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు మొదలయ్యాయి. చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమాల్లో హీరోయిన్ రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో విజయ్, రష్మికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజు క్లాప్ నిచ్చారు. అనంతరం దర్శకుడు వంశీ పైడిపల్లికి హీరో విజయ్, రష్మిక మందన్న, శరత్ కుమార్, దిల్ రాజు, శిరీష్ తో పాటు చిత్ర బృందం స్క్రిప్ట్ ని అందించారు.
వరుస బ్లాక్ బస్టర్ హిట్ లతో ఫామ్ లో వున్న తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సరి కొత్త నేపథ్యంలో పవర్ ఫుల్ కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ (వైల్డ్ డాగ్ డైరెక్టర్) అందిస్తున్నారు.
ఛాయాగ్రహణం కార్తీక్ పళని, డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే ని వివేక్, ఎడిటింగ్ కె. ఎల్ . ప్రవీణ్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి, కాస్ట్యూమ్స్ దీపాలి నూర్, వీఎఫ్ ఎక్స్ యుగంధర్, దర్శకత్వం వంశీ పైడిపల్లి.
బుధవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీ షెడ్యూల్ 5 రోజులు సాగనుందట. ఈ షెడ్యూల్ లో ఓ పాటని షూట్ చేస్తున్నట్టుగా తెలిసింది. తమన్ తొలిసారి విజయ్ చిత్రానికి వర్క్ చేస్తుండటంతో ఈ మూవీ ఆల్బమ్ ఓ రేంజ్ లో వుండే అవకాశం వుందని విజయ్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.