Begin typing your search above and press return to search.
ఏడు పాత్రల్లో విక్రమ్..`కోబ్రా`కి అంతుందా?
By: Tupaki Desk | 22 July 2022 5:30 PM GMTవెండి తెరపై చియాన్ విక్రమ్ ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల దిగ్గజ నటుడు. ఎలాంటి పాత్రకైనా ప్రాణప్రతిష్ట చేయగల నటుడు. కమల్ హాసన్ తర్వాత అంతటి గొప్ప నటుడిగా విక్రమ్ కి పేరుంది. కానీ చాలా కాలంగా విక్రమ్ కి సరైన సక్సెస్ పడలేదు. కనీసం చెప్పుకోదగ్గ విజయం కూడా విక్రమ్ ఖాతాలో కొన్నలేళ్లగా లేదనే చెప్పాలి.
భారీ చిత్రాలు సైతం అంచనాలు అందుకోవడం లో విఫలమవుతున్నాయి. దీంతో విక్రమ్ ఎఫెర్ట్ అంతా వృద్ధాగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో కుమారుడు ధృవ్ ని సైతం కోలీవుడ్ లో లాంచ్ చేయించారు. ఆ యంగ్ హీకరోతో కలిసి `మహాన్` అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో విక్రమ్ పేరు తెరమరుగవుతుందా? అన్న సందేహం సైతం తెరపైకి వస్తుంది.
అంతగా విక్రమ్ ని వైఫల్యాల్ని నిరుత్సాహపరిచాయి. ప్రస్తుతం విక్రమ్ `కోబ్రా` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్ . ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. `కోబ్రా`తో విక్రమ్ గట్టిగానే కొట్టబోతున్నాడని సంకేతాలు బలంగానే వీస్తున్నాయి. సినిమా భారీ కాన్వాస్ పైనే తెరకెక్కుతోంది.
ఏ.ఆర్ రెహమాన్ లాంటి దిగ్గజం సంగీతం అందిస్తున్నారు. `కేజీఎఫ్` భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమాలో విక్రమ్ ఏకంగా ఏడు రకాల పాత్రలు పోషించడంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవుతుంది. ఏడు పాత్రలు వేటికవి ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని టీమ్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పాత్రల్ని మరింత హైలైట్ గా మలిచేందుకు ఏడు పాత్రలకి డబ్బింగ్ కూడా విక్రమ్ నే చెబుతున్నారుట.
పాత్ర తీరును బట్టి..వివిధ వేరియేషన్స్ లో వాయిస్ ఉంటుందని అంటున్నారు. ఏడు రకాలుగా గొంతు మార్చి మాట్లాడటం అంటే ఎంతో అనుభవం కావాలి. అందుకోసం విక్రమ్ కొంత శిక్షణ కూడా తీసుకున్నాడని తెలిసింది. దానికి సంబంధించిన ట్రైనింగ్ పూర్తిచేసి చియాన్ డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఒక పాత్రకే సొంతంగా డబ్బింగ్ చెప్పించాలనకున్నారుట.
కానీ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు పాత్రలన్నింటికి విక్రమ్ వాయిస్ అయితేనే బాగుంటుందని ఆయనతో డబ్బింగ్ చెప్పిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా డబ్బింగ్ సహా సీజీ వర్క్ కూడా ఎక్కువగా ఉండటంతోనే సినిమా రిలీజ్ వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి చిత్రాన్ని ఆగస్ట్ 11న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడా తేదీని వెనక్కి తీసకున్నారు. ఇందులో క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ ఓ కీలక పాత్ర పొషిస్తుండటం విశేషం.