Begin typing your search above and press return to search.
రాజు గారి వారసుడి సినిమా అలర్ట్.. మళ్ళీ వచ్చే తేదీ ఇదే!
By: Tupaki Desk | 25 Feb 2022 5:27 AM GMTదిల్ రాజు ఫ్యామిలీ నుండి హీరోగా ఆశిష్ ఎంట్రీ ఇచ్చిన రౌడీ బాయ్స్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ మరియు రాధేశ్యామ్ సినిమాలు కరోనా వల్ల వాయిదా పడటంతో బంగార్రాజు సినిమా తో కలిసి రౌడీ బాయ్స్ సినిమా వచ్చిన విషయం తెల్సిందే.
సంక్రాంతికి విడుదల అయిన బంగార్రాజు.. హీరో ఇంకా ఇతర సినిమాలు కూడా ఓటీటీ లో అప్పుడే వచ్చేశాయి. కాని రౌడీబాయ్స్ మాత్రం ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వలేదు.
థియేటర్ స్క్రీనింగ్ మిస్ అయిన వారు చాలా మంది ఆశిష్ కోసం రౌడీ బాయ్స్ ను చూడాలని ఆశగా ఉన్నారు. కాని ఇప్పటి వరకు దిల్ రాజు సినిమా ను స్ట్రీమింగ్ చేయలేదు. సినిమా విడుదల తర్వాత 50 రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుని మరీ జీ5 వారికి ఈ సినిమాను అమ్మేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ సినిమా స్ట్రీమింగ్ ఆలస్యం అవుతుందని సమాచారం అందుతోంది.
ఎట్టకేలకు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 11వ తారీకున రౌడీ బాయ్స్ సినిమా ను డిజిటల్ స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఒకటి రెండు రోజుల్లో జీ 5 మరియు దిల్ రాజు కాంపౌండ్ నుండి ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.
రౌడీ బాయ్స్ సినిమా అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ను రాబట్టినట్లుగా దిల్ రాజు కాంపౌండ్ ఆ సమయంలో ప్రకటించడం జరిగింది. అయితే టాక్ మాత్రం డిఫరెంట్ గా వచ్చింది. ఇతర సినిమాలు పెద్దగా లేని కారణంగా రౌడీ బాయ్స్ సినిమాకు కలిసి వచ్చి వసూళ్లు ఒక మోస్తరుగా వచ్చినట్లుగానే తెలుస్తోంది. మొదటి సినిమా తో అది కూడా మిశ్రమ స్పందనతో అంతటి వసూళ్లు రావడం అంటే ఖచ్చితంగా ఆశిష్ లక్ అనుకోవాల్సిందే.
హీరోగా ఆశిష్ కు మంచి పేరును తెచ్చి పెట్టిన గల్లి బాయ్స్ సినిమా డిజిటల్ ప్లాట్ పై మరోసారి గ్రాండ్ రిలీజ్ కు సిద్దం అవుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఈమద్య కాలంలో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ప్రతి ఒక్క సినిమాకు మంచి స్పందన వస్తుంది. కనుక రౌడీ బాయ్స్ కి కూడా జీ 5 లో మంచి రెస్పాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.