Begin typing your search above and press return to search.
రెడ్ లిరిక్: నువ్వు నువ్వే.. ఆహ్లాదం బ్యూటిఫుల్..
By: Tupaki Desk | 6 March 2020 2:02 PM GMTరామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రెడ్. కిశోర్ తిరుమల దర్శకుడు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9న మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ఇది. రామ్ పోతినేని (#రాపో) ద్విపాత్రాభినయం చేస్తుండడం మరో హైలైట్. ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ కం లవ్ ఎంటర్ టైనర్.. ఆద్యంతం ఎమోషన్స్.. సెంటిమెంట్ ఆకట్టుకుంటాయని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి `నువ్వే నువ్వే ..` లిరికల్ వీడియో రిలీజైంది. ఈ ట్యూన్ మణి శర్మ మార్క్ తో ఫర్వాలేదనిపించింది. ఇక వెటరన్ లిరిసిస్ట్ సిరివెన్నెల సాహిత్యం.. రమ్య బెహారా - అనురాగ్ కులకర్ణి గానం ఆకట్టుకున్నాయి. సాంగ్ విజువల్స్ లో రామ్ - మాళవిక శర్మ మధ్య రొమాన్స్ పీక్స్ లో కుదిరింది. విదేశీ లొకేషన్లు.. మంచు కొండల వాతావరణంలో అద్భుతమైన విజువల్స్ ని క్యాప్చుర్ చేశారని ఈ సాంగ్ మేకింగ్ వీడియో చెబుతోంది.
ఇక ఈ చిత్రంలో మాళవికతో పాటు.. నివేథ పెతురాజ్ - అమృతా అయ్యర్ నాయికలుగా నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో విజయం కోసం రామ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. తమిళ హిట్ చిత్రం తడం కి రీమేక్ అని చెబుతున్నారు కాబట్టి... తెలుగులో రీచబులిటీ రేంజ్ ఎలా ఉంటుందో చూడాలి. రెడ్ టైటిల్ కి స్పందన బావుంది. రామ్ ఎనర్జీ ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.