Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ 2 ట్రైల‌ర్ లాంచ్ కి హోస్ట్ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   25 March 2022 7:30 AM GMT
కేజీఎఫ్ 2 ట్రైల‌ర్ లాంచ్ కి హోస్ట్ ఎవ‌రు?
X
ట్రిపుల్ ఆర్ కోసం యావ‌త్ దేశం మొత్తం దాదాపు మూడేళ్లుగా ఎదురుచూసింది. అ ఎదురుచూపుల‌కు తెర‌దించుతూ ఎట్ట‌కేల‌కు ట్రిపుల్ ఆర్ ఈ శుక్ర‌వారం వ‌రల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. థియేట‌ర్ల‌లో ఇప్పుడు దేశ వ్యాప్తంగా జాత‌ర మొద‌లైంది. ఒక్క రోజు ముందే అంటే గురువారం రాత్రి ప్రీమియ‌ర్స్ నుంచే ట్రిపుల్ ఆర్ హంగామా మొద‌లైంది. ఇప్ప‌టికే టాక్ బ‌య‌టికి వ‌చ్చేయ‌డంతో ఫ్యాన్స్‌, టీమ్ సెల‌బ్రేష‌న్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఇదిలా వుంటే ప్ర‌స్తుతం మ‌రో మోన్ స్టార్ లాంటి సంల‌చ‌న చిత్రం కోసం దేశం ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే.

అదే `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`. రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన చిత్ర‌మిది. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోసం ఆడియ‌న్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్ చాప్ట‌ర్ 1 `బాహుబ‌లి` త‌ర‌హాలో ఆక‌ట్టుకోవ‌డంతో చాప్ట‌ర్ 2 పై అంచ‌నాలు స్కై హైకి చేరుకున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగానూ ఈ మూవీ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. భారీ బ‌డ్జెట్ తో భారీ అంచ‌నాల‌తో రాబోతున్న ఈ మూవీని ఏప్రిల్ 14న ఐదు భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్టుగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

అయితే అప్ప‌టి నుంచి ఈ మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించ‌డం లేదంటూ ఫ్యాన్స్ విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే వున్నారు. వారి మొర‌ని మేక‌ర్స్ ఆల‌కించారో ఏమోగానీ మొత్తానికి ప్ర‌మోష‌న‌ల్ యాక్టీవిటీస్ ని మొద‌లుపెట్టేశారు. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా `తూఫాన్ తూఫాన్ ..` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. మ‌రో రెండు రోజుల్లో ట్రైల‌ర్ ని అత్యంత భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

ఈ భారీ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న `స‌లార్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీని కేజీఎఫ్` ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఆ కార‌ణంగానే ప్ర‌భాస్ `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` ట్రైల‌ర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా రాబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈ వెంట్ కోసం ఇప్ప‌టికే ఏర్పాట్ల‌ని మొద‌లు పెట్టేశార‌ని, త్వ‌ర‌లోనే వేదిక ఎక్క‌డ‌న్న‌ది స్ప‌ష్టం చేయ‌బోతున్నార‌ని తెలిసింది.

అయితే ట్రైల‌ర్ రిలీజ్ ఈ వెంట్ కోసం బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూస‌ర్ , క‌మ్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ హోస్ట్ గా మార‌బోతున్నార‌ట‌. పలు టీవీ షోల్లో హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తూ ఎంట‌ర్ టైన్ చేస్తున్న క‌ర‌ణ్ జోహార్ తొలి సారి ఓ సౌత్ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ వేడుక‌కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం విశేషంగా చెప్పుకువంటున్నారు. క‌ర‌ణ్ జోహార్ `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` ట్రైల‌ర్ రిలీజ్ వేడుక‌కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌ని మేక‌ర్స్ శుక్ర‌వారం ప్ర‌క‌టిస్తూ ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. ఇంకో ముఖ్య విష‌యం ఏంటంటే ఈ మూవీ ట్రైల‌ర్ ని క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ విడుద‌ల చేయ‌బోతున్నారు.